చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీనిని HMPV(హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్) గా చెబుతున్నారు. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి మరో కరోనాను తలపిస్తోంది. ఇప్పటికే లక్షల మంది వైరస్ వ్యాప్తితో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌లానే ఇది కూడా వేగంగా విస్తరిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా చైనాలోని ఉత్తర ప్రాంతాలలో 14 ఏళ్లలోపు పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తులపై ప్రభావం ఈ వైరస్ ప్రధాన లక్షణాలు. HMPV వైరస్ అనేది కొత్తది కాదు.. 20 ఏళ్ళ క్రితమే వైద్యులు దీనిని గుర్తించారు. అయితే ఇప్పుడు దీని వ్యాప్తి కట్టలు తెచ్చుకుంది. 20 ఏళ్లలో దీనికి సంబంధించిన వాక్సిన్, మందు కనుగొనలేదు.
మాకు రెగ్యులర్ సమాచారం కావాలి..
అయితే ఈ వైరస్ వ్యాప్తి గురించి చైనా పెద్దగా రియాక్ట్ అవడం లేదు. చైనాలో ఆసుపత్రులు వైరస్ రోగులతో నిండిపోతున్నా ప్రమాదకారి కాదంటూ మాటలు చెబుతోంది. దీని వలన ప్రాణ భయం లేదని చెబుతోంది. కానీ ఈ కొత్త వరస హెఎమ్పీవీ నెమ్మదిగా ప్రక్క దేశాలకూ వ్యాపిస్తోంది. జపాన్‌లో , ఇండియాలో కూడా వైరస్ లక్షణాలు కనిపించాయని చెబుతున్నారు. అందుకే దీనిపై కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఇంతకు ముందు కూడా నాలుగేళ్ళ క్రితం కరోనా వైరస్ ఇలానే చైనా నుంచి మొదలై ప్రపంచాన్ని కబళించింది అని... ఇప్పుడు ఈ కొత్త వైరస్ ఆ విధంగానే భయపెడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది. ఈ విషయంలో తమకు ఆందోళనగా ఉందని చెబుతోంది. అందుకే ఎప్పటికప్పుడు తమకు కొత్త వైరస్ గురించి సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. దాంతో పాటూ భారత్‌లో వైరస్ వ్యాప్తి చెందకుండా సంసిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ నిర్ణయించుకుంది.
Also Read: USA: అమెరికా ప్రతినిధుల సభలో ఆరుగురు భారతీయ నేతలు ప్రమాణ స్వీకారం
దీనికి సంబంధించి ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన నిన్న జాయింట్ మోనిటిరింగ్ గ్రూప్ సమావేశమైంది. ఇందులో డబ్ల్యూహెచ్ఓ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇంటిగ్రేడెట్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఐసీఎంఆర్, న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు. చలికాలంలో ఫ్లూ సీజన్ ఉంటుందని..కానీ ఇప్పుడు చైనాలో వ్యాప్తి చెందుతున్న వైరస్ పెరుగుదల సాధారణంగా లేదని వైద్యులు చెబుతున్నారు. చైనాలో వైరస్ తీవ్రతకు చలికాలంలో వ్యాప్తిచెందే ఇన్‌ఫ్ల్యూయోంజా వైరస్, ఆర్ఎస్వీ, హ్యూమన్ మెటానిమోవైరస్ వంటి వైరస్‌లు కారణమని నివేదికలు చెబుతున్నాయని అన్నారు.
Also Read: VK: నా జేబులో సాండ్ పేపర్ లేదు..ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌కు విరాట్ కౌంటర్