/rtv/media/media_files/2025/11/23/study-in-bihar-finds-uranium-in-breastmilk-2025-11-23-16-39-07.jpg)
Study In Bihar Finds Uranium In Breastmilk
పుట్టిన పిల్లలు తల్లిపాలు(breast-milk) తాగడం ఎంతో ఆరోగ్యకరం. తల్లిపాలు(breast-feed) తాగే శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో పెరుగుతారని వైద్యులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు తల్లిపాలు కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తుతున్నాయి. బీహార్‌లో ఇటీవల శాస్త్రవేత్తలు తల్లిపాలపై ఓ పరిశోధన చేశారు. ఆ పాలలో రేడియో యాక్టివ్ మెటిరియల్ యురేనియం(uranium) ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన డా.అశోక్ శర్మ మీడియాతో మాట్లాడారు. '' బిహార్‌లో పలు గ్రామాలకు చెందిన 40 బాలింతల నుంచి పాలను సేకరించి టెస్ట్ చేశాం. అందులో యురేనియం ఉన్నట్లు గుర్తించాం.
Also Read: రెండు సెకన్ల వీడియో.. 100 మిలియన్ల వ్యూస్..ఇంతకీ ఏం జరిగిందంటే?
Study In Bihar Finds Uranium In Breastmilk
యురేనియం స్థాయిలు బాలింతల పాలల్లో తక్కువగానే ఉన్నాయి. కానీ వాటిని తాగే శిశువులు దీర్ఘకాలంలో క్యాన్సరేతర సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. అలాగే తల్లుల ఆరోగ్యంపై కూడా ప్రభావం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు గుర్తించామని'' అశోక్ శర్మ తెలిపారు. మరోవైపు బాలింతల పాలలో యూరేనియం ఉన్న విషయంపై సీనియర్ సైంటింస్ట్, జాతీయ విప్తు నిర్వహణ అథారిటీ (NDMA) అధికారి డా.దినేష్ అస్వాల్ కూడా స్పందించారు.
Also Read: కొత్త లేబర్ కోడ్..కార్మికులకు అదనపు భద్రత, సంక్షేమం
తల్లి పాలలో యురేనియం స్వల్ప మోదాతులో ఉందని తెలిపారు. దీనివల్ల శిశువులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. పరీక్షలో తేలిన యూరేనియం నమునాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) పర్మిషన్ ఇచ్చిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆందోళ పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా చూసినా నేలలో సహజంగా కొత్తమొత్తంలో యూరేనియం ఉంటుందని అన్నారు. పాలిచ్చే తల్లిలోకి వచ్చే యూరేనియంలో ఎక్కువగా మూత్ర విసర్జనలోనే బయటకు వెళ్తుందని చెప్పారు. దీనివల్ల తల్లిపాలలో తక్కువ మొత్తంలోనే యూరేనియం నిల్వ ఉంటుందని స్పష్టం చేశారు.
Follow Us