Telangana: తెలంగాణ లో భిన్న వాతావరణం.. ఆ జిల్లాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎండలు.. !
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
ఏపీలోవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల మేర పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్లో 3.2 డిగ్రీలు పెరిగి 42.5 డిగ్రీలుగా నమోదయ్యింది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది.సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.