/rtv/media/media_files/2025/04/24/NIU4Yk2WO1UQPkki0ng9.jpg)
Sunstroke claims seven lives in Telangana
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు సాధారణం కన్నా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రానున్న రెండ్రోజుల పాటు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని పేర్కొంది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు ఏడుగురు మృతి చెందారు.
Also Read: చంచల్‌గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
Sunstroke Claims Seven Lives
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్టా గ్రామానికి చెందిన గంగారం (55) వడదెబ్బ తగిలి మృతి చెందారు. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన రవళి(35), ఖమ్మం జిల్లా మధిర పట్టణం రామనాథం వీధిలో ఉంటున్న శేషాచారి (80), కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామంలోని కళ్లెం రమేశ్ (54), పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీలోని పుల్లూరి రమేష్‌కుమార్ (37), కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామంలోని కనక కాశీరాం (42), హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వేస్టేషన్ ఆరో ప్లాట్‌ఫాంలో ఉన్న ఓ యాచకుడు (70) మృతి చెందారు.
Also Read: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత
మరోవైపు నిజామాబాద్ జిల్లాలో బుధవారం అత్యధికంగా 44.5 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఇది 3.6 డిగ్రీలు ఎక్కువ. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 44.3 డిగ్రీలు, మెదక్‌లో 43.4 డిగ్రీలు, రామగుండంలో 42.8 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!
Also Read: పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!
latest-news | summer | weather | weather-update | telangana weather updates | Summer Weather Update | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu