VC Sajjanar : నా పేరుతోనే సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు: సీపీ సజ్జనార్
తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతోనే నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి ఏకంగా రూ. 20వేలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా వెల్లడించారు.
తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతోనే నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి ఏకంగా రూ. 20వేలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా వెల్లడించారు.
ఇన్నాళ్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సేవలందించిన వీసీ సజ్జనార్ ను ప్రభుత్వం తిరిగి హైదరాబాద్ సీపీగా నియమించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ తన చివరి రోజును వినూత్నంగా గడిపారు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా IPSల బదిలీలు చేసింది. ఇందులో భాగంగా IPS సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్‌గా నియమించింది. పోలీస్ డిపార్ట్మెంట్లో సజ్జనార్‌కు అంటూ ఓ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన ఇప్పటి వరకూ రెండు కేసుల్లో ఏడు ఎన్కౌంటర్లు చేశారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో సైబర్ కేటుగాళ్ల వలలో ఓ యువకుడు చిక్కుకున్నాడు. నానో బనానా మాదిరి ఉన్న ఇమేజ్ ఎడిటర్ యాప్ డౌన్లోడ్ చేశాడు. అందులో తన ఫొటో పెట్టి 3డిలోకి మార్చుకున్నాడు. తర్వాత అకౌంట్లో ఉన్న రూ.70వేలు మాయమయ్యాయి.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ 'యాత్ర దానం' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుభకార్యాల రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్దులను విహారయాత్రలకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. దీని కోసం దాతలు తగిన విరాళం అందించి తీసుకెళ్లొచ్చు.
హైదరాబాద్ పరిధిలోని జనరల్ బస్ పాస్ దారులకు TGSRTC శుభవార్త చెప్పింది. రూ.20 కాంబి టికెట్‌తో మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్‌పాస్ కలిగినవారు ఈ సదుపాయాన్ని మెట్రో డీలక్స్ బస్సులలో పొందవచ్చు.
టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియా విషయంలో ఎప్పటికప్పుడు సమజాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌లపై ఆయన స్పందించిన తీరు సంచలనంగా మారింది. అయితే తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ వైరల్‌గా మారింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పంజాగుట్ట పీఎస్‌లో 11మందిపై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా తాజాగా విష్ణుప్రియ, టేస్టీతేజకు పోలీసులు నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు హీరోయిన్లు బెట్టింగ్ యాప్ ఉచ్చులో చిక్కుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ & మంచు లక్ష్మి వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పలువురు ఆ వీడియోలను సజ్జనార్‌కు ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.