NANO BANANA AI: నానో బనానా ట్రెండ్.. తెలంగాణ యువకుడికి సైబర్ వల.. రూ.70వేలు మాయం

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో సైబర్ కేటుగాళ్ల వలలో ఓ యువకుడు చిక్కుకున్నాడు. నానో బనానా మాదిరి ఉన్న ఇమేజ్ ఎడిటర్ యాప్ డౌన్‌లోడ్ చేశాడు. అందులో తన ఫొటో పెట్టి 3డిలోకి మార్చుకున్నాడు. తర్వాత అకౌంట్లో ఉన్న రూ.70వేలు మాయమయ్యాయి.

New Update
nano banana ai saree trend tsrtc md vc sajjanar alert to people

Scam alert

ఇప్పుడంతా ‘‘నానో బనానా, సారీ ట్రెండ్’’ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫోటో ఎడిటింగ్ ట్రెండ్. ఈ ట్రెండ్ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయిపోయింది. ఒక ఫొటో సెలెక్ట్ చేసి సరైన ప్రాంప్ట్ అందిస్తే.. దానికి సంబంధించిన ఫొటో అందంగా చూపిస్తుంది. అయితే దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

నానో బనానా ట్రెండ్

నానో బనానా ట్రెండ్.. ఇది గూగుల్ జెమిని (Gemini) ఏఐ టూల్‌లోని ఒక ఫీచర్. దీని అసలు పేరు ‘‘Gemini 2.5 Flash Image’’. ఈ టూల్ ఐకాన్ అరటిపండు (banana)లా ఉండటం వల్ల.. దీనికి నానో బనానా అనే పేరు పెట్టారు. ఈ ఫీచర్ చాలా వేగంగా, హై క్వాలిటీతో 3D ఫోటోలను సృష్టిస్తుంది. ఈ టూల్‌ని ఉపయోగించి మనం అప్‌లోడ్ చేసిన ఫోటోను, మనం ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా కొత్త రూపంలోకి మార్చుతుంది. ఈ బనానా ఫీచర్ లాంచ్ అయిన అతి తక్కువ రోజుల్లోనే జెమిని యాప్ డౌన్‌లోడ్స్ 10 మిలియన్లు దాటింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ ఫీచర్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను క్రియేట్ చేయడం గమనార్హం. 

సారీ ట్రెండ్

నానో బనానా టూల్ ఉపయోగించి ఫోటోలను రకరకాలుగా మార్చవచ్చు. అందులో బాగా పాపులర్ అయిందీ సారీ ట్రెండ్. ఇందులో వినియోగదారులు తమ ఫోటోను అప్‌లోడ్ చేసి.. ఒక ప్రత్యేకమైన ప్రాంప్ట్‌ను ఇస్తే.. దాని సహాయంతో ఏఐ వారి ఫోటోను రెట్రో బాలీవుడ్ స్టైల్‌లో లేదా పాత సినిమా పోస్టర్లలా కనిపించేలా చీరలో ఉన్నట్టుగా మారుస్తుంది. పాతకాలపు సినిమాల మాదిరిగా గోల్డెన్ కలర్ లైటింగ్‌, షాడోలు, వింటేజ్ టెక్చర్‌తో ఈ ఫోటోలు సృష్టిస్తుంది.

70 వేలు మాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో సైబర్ కేటుగాళ్ల వలలో ఓ యువకుడు చిక్కుకున్నాడు. జెమిని ఏఐలో నానో బనానా టూల్‌లో ఆ వ్యక్తి తన ఫొటోను 3డి ఫొటోగా మార్చుకోవాలని అనుకున్నాడు. దీంతో సోషల్ మీడియాల్లో నుంచి ఇమేజ్‌ ఎడిటర్‌ అనే యాప్‌ లింకును డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాడు. అందులో తన ఫొటో సెలెక్ట్ చేసుకుని దానిని 3డీలోకి మార్చుకున్నాడు. అలా చేసిన కొద్ది సేపటికే అతడి బ్యాంకు అకౌంట్లోని రూ.70 వేలు మాయం అయ్యాయి. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

ఈ ట్రెండ్‌తో జాగ్రత్త

నానో బనానా ట్రెండ్ సరదాగా ఉన్నప్పటికీ.. దీని వల్ల ఎన్నో సమస్యలు ఉండే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఏఐ టూల్స్‌లో మీ ఫోటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా.. ఆ డేటా ఎలా ఉపయోగించబడుతుందో తెలియదని చెబుతున్నారు. అలాగే జెమినిని పోలిన నకిలీ వెబ్‌సైట్లు లేదా యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అవి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని అలర్ట్ చేస్తున్నారు. అందువల్ల సున్నితమైన లేదా రహస్యమైన ఫోటోలను అప్‌లోడ్ చేయకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. 

వీ.సీ సజ్జనార్ పోస్టు

ఇక ఇదే విషయంపై TSRTC ఎండీ.. వీ.సీ సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేశారు. ట్రెండింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలా మంది సైబర్ కేటుగాల్లు సామన్య ప్రజలపై మోసాలకు ఒడిగట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ టాపిక్‌లతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నానో బనానా ట్రెండింగ్ క్రేజ్ ఉచ్చులోపడి.. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తే.. సైబర్‌ మోసాలు జరగడం ఖాయమని తెలిపారు. ఇలా అయితే ఒకే ఒక్క క్లిక్‌తో మీ బ్యాంకు అకౌంట్‌లోని డబ్బులు నేరుగా సైబర్ కేటుగాల్ల చేతుల్లోకి చేరుతుందని హెచ్చరించారు. అందువల్ల పర్సనల్ ఫొటోలు, వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ కూడా ఫేక్ వెబ్‌సైట్లల్లో పంచుకోవద్దని అన్నారు.

Advertisment
తాజా కథనాలు