/rtv/media/media_files/2025/11/15/vc-sajjanar-2025-11-15-12-38-48.jpg)
సోషల్ మీడియా(Social Media) వేదికగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) సరికొత్త మోసాలకు(Cyber ​​Crime) పాల్పడుతున్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి, వారి స్నేహితులను ఆర్థికంగా దోచుకునే ప్రయత్నాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) పేరుతోనే నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి ఏకంగా రూ. 20వేలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా వెల్లడించారు.
⚠️ ముఖ్య గమనిక❗
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 15, 2025
నా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు 'నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి' అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు.
దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు ₹20,000 ను మోసగాళ్ల ఖాతాకు పంపారు.
నా వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీ… https://t.co/h2hg43FChY
Also Read : KCR కళ్లకు గంతలు కట్టి మోసం చేశారు.. పుండు మీద కారం చల్లుతున్న కవిత!
ఆపదలో ఉన్నానని.. డబ్బులు పంపాలని
తన పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశారని సజ్జనార్ తెలిపారు. ఆపదలో ఉన్నానని.. డబ్బులు పంపాలని తన స్నేహితుడు ఒకరికి మెసేజ్ పంపారని... అది నిజమని నమ్మి తన చేశారని రూ.20 వేలు పంపి మోసపోయారని చెప్పారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్‌లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Also Read : రాజకీయంగా నిలబడడానికి 40 ఏళ్లు పట్టింది..నవీన్ యాదవ్ బావోద్వేగం
మనమంతా జాగ్రత్తగా ఉంటేనే
తన పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్‌లో వచ్చే రిక్వెస్ట్‌లను స్పందించవద్దన్నారు. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండని.. ఒకవేళ అలా ఎవరైనా మెసేజ్‌లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించాలని సూచించారు. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా http://cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలన్నారు. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే… సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలమని సజ్జనార్ తెలిపారు.
Follow Us