/rtv/media/media_files/2025/05/02/nMBGynuTusBGBnzsHHQW.jpg)
TGSRTC
టీజీఎస్ఆర్టీసీ తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో ప్రయాణిస్తున్న జనరల్ బస్ పాస్ ప్రయాణికులకు తీపికబురు చెప్పింది. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ మంత్లీ బస్ పాస్ హోల్డర్లు అన్ని మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించడానికి వీలుగా ‘మెట్రో కాంబి టికెట్’ను పరిచయం చేసింది. దీని ద్వారా రూ.20 టికెట్ తీసి బస్ పాస్ కలిగిన ఎవరైనా మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది.
Also read : 12 ఏళ్లుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో దొరికిన ఇంటి దొంగ!
‘మెట్రో కాంబి టికెట్’
దీంతో మెట్రో బస్‌పాస్, జనరల్ బస్‌పాస్, నెలవారీ బస్ పాస్ ఉన్నవారు హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో చక్కర్లు కొట్టొచ్చు. దీనిని టీజీఎస్ఆర్టీసీ తక్షణమే అమలులోకి తీసుకురానుంది. సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ మంత్లీ బస్ పాస్ హోల్డర్లు ప్రతి ట్రిప్‌కు రూ. 20 లతో కాంబి టికెట్ కొనుగోలు చేసి అన్ని మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించొచ్చు.
#Hyderabad పరిధిలోని జనరల్ బస్ పాస్ దారులకు శుభవార్త. రూ.20 కాంబినేషన్ టికెట్ తో మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును #TGSRTC యాజమాన్యం కల్పించింది. మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్ పాస్ కలిగిన వారు ఈ కాంబినేషన్ సదుపాయాన్ని మెట్రో డీలక్స్ బస్సులలో పొందవచ్చు.… pic.twitter.com/tRHSTGQYdm
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 1, 2025
హైదరాబాద్ నగర్ ప్రజల అభ్యర్థన మేరకు.. వారికి సౌకర్యవంతంగా ప్రయాణాన్ని అందించే ఉద్ధేశంతో టీజీఎస్ఆర్టీసీ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఇదే విషయాన్ని తెలియజేస్తూ TGSRTC ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వివరాలు పంచుకున్నారు.
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
‘‘ #Hyderabad పరిధిలోని జనరల్ బస్ పాస్ దారులకు శుభవార్త. రూ.20 కాంబినేషన్ టికెట్ తో మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును #TGSRTC యాజమాన్యం కల్పించింది. మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్ పాస్ కలిగిన వారు ఈ కాంబినేషన్ సదుపాయాన్ని మెట్రో డీలక్స్ బస్సులలో పొందవచ్చు.’’ అని సజ్జనార్ తెలిపారు.
tgsrtc-bus | latest-telugu-news | telugu-news | vc-sajjanar | tsrtc md vc sajjanar