/rtv/media/media_files/2025/09/29/tgs-rtc-md-sajjanar-2025-09-29-16-22-54.jpg)
TGS RTC MD Sajjanar
వీసీ సజ్జనార్(vc-sajjanar) ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా, ఆకతాయిలకు సింహాస్వప్నంగా చెప్పుకుంటారు. ఐపీఎస్ అధికారిగా ఆయన ఎక్కడ విధులు నిర్వహించినా తనకుంటూ ఒక ప్రత్యేకతను ఆయన సొంతం చేసుకుంటారు. ఆ రంగాల్లో తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటారు. కాగా ఇన్నాళ్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సేవలందించిన వీసీ సజ్జనార్ ను ప్రభుత్వం తిరిగి హైదరాబాద్ సీపీగా నియమించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ తన చివరి రోజును వినూత్నంగా గడిపారు. విధుల్లో భాగంగా ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆర్టీసీ, ప్రజా రవాణాపై తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. అందరూ ప్రయాణికుల్లాగే సామాన్యుడిలా ఆర్టీసీ(TGSRTC) బస్సులో ప్రయాణించి మరోసారి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. బస్సులో తనతో పాటు ప్రయాణిస్తున్న వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రయాణం చేశారు. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా యూపీఐ పేమెంట్ చేసి అందరిలాగే టికెట్ తీసుకున్నారు.
Also Read : నీ అం.. కోసేస్తా... అఘెరీపై వర్షిణి సంచలన వ్యాఖ్యలు
Sajjanar Did On His Last Day As RTC MD
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
— TGSRTC (@TGSRTCHQ) September 29, 2025
సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు.
యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్… pic.twitter.com/qiBzq9odSI
ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్ హైదరాబాద్ సీపీ(encounter specialist vc sajjanar)గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్‌లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ వద్ద అయన బస్ ఎక్కారు. అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బస్ భవన్ వరకు 113 I/M రూట్ సిటీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. ఈ సదర్భంగా పలువురు ప్రయాణికులతో ముచ్చటించారు. ఆర్టీసీలో రవాణా సదుపాయలు ఎలా ఉన్నాయనే విషయలపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో టీజీఎస్‌ఆర్టీసీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
కాగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సజ్జనార్‌కు కూడా స్థానచలనం కల్పించిన విషయం తెలిసిందే. బదిలీలో భాగంగా సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా నియమించారు. అక్టోబర్ ఒకటో తేదీన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టనున్నారు.