VC Sajjanar : ఆ మానసిక రోగులకు దూరంగా ఉండండి: వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా విషయంలో ఎప్పటికప్పుడు సమజాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో  బెట్టింగ్‌ యాప్‌లపై ఆయన స్పందించిన తీరు సంచలనంగా మారింది. అయితే తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్‌ వైరల్‌గా మారింది.

New Update
RTC MD VC Sajjanar

RTC MD VC Sajjanar

VC Sajjanar : సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావడానికి కొంతమంది తాము ఏం చేస్తున్నామో అనే కనీస జ్ఞానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. తాము చేసే రీల్స్‌ వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది. ఎవరికీ నష్టం చేస్తుందనే కనీస సోయిన మరిచి ప్రవర్తిస్తున్నారు.  ఈ క్రమంలో  టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా విషయంలో ఎప్పటికప్పుడు సమజాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో  బెట్టింగ్‌ యాప్‌లపై ఆయన స్పందించిన తీరు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

 సోషల్‌ మీడియా వేదికగా చాలామంది అసభ్య పోస్టింగులు,  డ్రగ్స్, గంజాయి, గన్ కల్చర్, జుగుప్సాకరమైన పనులు చేయడం, న్యూడిటీ, ఫేక్ సమాచారం, ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ లాంటి పలు రకాల వీడియోలు షేర్‌ చేస్తున్నారు. కేవలం  లైకులు, వైరల్, పాపులర్ అవ్వడం కోసం ఇలాంటివి ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి ఎన్నో సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫస్ట్ టైమ్ గంజాయి తాగితే ఎలా ఉంటుందని అని ఇద్దరు యువకులు రీల్స్ వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియోను ఎక్స్ వేదికగా వీసీ సజ్జనార్ పోస్ట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్‌ అందరినీ ఆలోజింప జేస్తున్నది.

Also Read: CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని

‘పిచ్చి పలురకాలు.. వెర్రి వేయి రకాలు.. అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎంతకైనా తెగిస్తారా? ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో కనీసం సోయి ఉండక్కర్లేదా? ఎంతో మంది యువత భవిష్యత్‌ను చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్‌పై వీడియోలు చేస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు.. చెప్పండి? సోషల్ మీడియాకు బానిసై రీల్స్ పిచ్చి పట్టిన ఇలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండండి. వ్యూస్, లైక్స్, కామెంట్స్ మాత్రేమే వీళ్లకు కావాలి. రాత్రికి రాత్రే పాపులర్ అయ్యేందుకు ఏమైనా చేస్తారు. సమాజం ఎటుపోయిన, ఎవరు ఏమైపోయిన వీళ్లకు సంబంధం లేదు’ అని ట్వీట్‌లో వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Advertisment
తాజా కథనాలు