Betting Apps: షాకింగ్ న్యూస్.. బెట్టింగ్ యాప్‌ ఉచ్చులో పవన్ కళ్యాణ్ హీరోయిన్ & మంచు లక్ష్మి.. అరెస్టుకు రంగం సిద్ధం!

టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు హీరోయిన్లు బెట్టింగ్ యాప్ ఉచ్చులో చిక్కుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ & మంచు లక్ష్మి వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పలువురు ఆ వీడియోలను సజ్జనార్‌కు ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

New Update
Pawan Kalyan heroine Nidhi Agarwal and Manchu Lakshmi betting apps promoting videos gone viral

Pawan Kalyan heroine Nidhi Agarwal and Manchu Lakshmi betting apps promoting videos gone viral

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై మాజీ ఐపీఎస్, ప్రస్తుత టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీ.సీ సజ్జనార్ ఫోకస్ పెట్టారు. వరుసగా ఒక్కొక్కరి బండారాన్ని బయటకు లాగుతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వైజాగ్ లోకల్ బాయ్ నానిని అరెస్టు చేశారు. ఇటీవల మరో యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం బయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

ఇదేక్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రెటీల బెట్టింగ్ యాప్స్ ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన హీరోయిన్ కాజల్ కు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.  ఆ వీడియోలను ఓ నెటిజన్ వీ.సీ సజ్జనార్ కి ట్యాగ్ చేస్తూ సవాల్ విసిరాడు. @సజ్జనార్‌విసి, @APPOLICE100.. మరి ఇప్పుడు కాజల్ అగర్వాల్ ని అరెస్ట్ చేయగలరా?  సెలబ్రెటీలకు సామాన్యుడికి ఎప్పుడూ ఈ  పక్షపాతం ఎందుకు? అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశాడు. మరి దీనిపై వీసీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

మరో ఇద్దరు హీరోయిన్లు

దీంతోపాటు తాజాగా మరో ఇద్దరి హీరోయిన్లకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మీ, అలాగే టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వీడియోలు బయటకువచ్చాయి. దీంతో బెట్టింగ్  యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కొరడా ఝళిపిస్తున్న నైపథ్యంలో తెరపైకి ఈ హీరోయిన్ల పేర్లు రావడం ఆసక్తికరంగా మారింది. 

Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి

నిధి అగర్వాల్ అండ్ మంచు లక్ష్మీ

అందులో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తున్న నిధి అగర్వాల్.. JeetWin అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు కనిపించింది. అలాగే మంచు లక్ష్మి సైతం yolo 24/7 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది. వాటిని వీ.సీ సజ్జనార్ కి ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ''ఎన్ని రోజులు చిన్న పర్కలు పడతారు సజ్జనార్ గారు.. బొమ్మ చాపలని పడితే  బెట్టింగ్ యాప్స్ నిర్మూళన ఉద్యమానికి సార్థకత ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళకు ఇది వర్తిస్తుందో లేదో ముందు ముందు చూడాలి" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరి వీటిపై సజ్జనార్ ఎలా రియాక్ట్ అవుతారో.. పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో అని పలువురు చర్చించుకుంటున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు