Fetus: షాకింగ్ ఘటన.. మహిళ లివర్‌లో 3నెలల పిండం
ఉత్తరప్రదేశ్‌లో మహిళకు గర్భాశయంలో కాకుండా కాలేయంలో 12 వారాల పిండం పెరుగుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. బులంద్‌షహర్‌కు చెందిన ఈ మహిళ 2 నెలలుగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతున్నది. దీంతో ఆమె మీరట్‌లోని హాస్పిటల్‌కు వెళ్లింది.