/rtv/media/media_files/2025/07/13/kasib-pathan-2025-07-13-20-54-45.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందూ పేరు మార్చుకొని డజన్ల కొద్దీ అమ్మాయిలను మోసం చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. యువకుడిని నవేద్ అలియాస్ ఖాసిం పఠాన్‌గా గుర్తించారు. సోషల్ మీడియాలో తన పేరు శివ వర్మగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. నుదిటిపై తిలకం పెట్టుకుని, చేతికి కలావ కట్టుకుని హిందువుగా చెప్పుకునేవాడు. ఖాసిం డజనుకు పైగా హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకున్నాడని పోలీసులు తెలిపారు.
🚨 Love J!had Horror in UP 🚨
— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) July 13, 2025
Kasib Pathan (posing as Shiv Verma) & brother Kaif trapped hundreds of Hindu girls in Shahjahanpur.
🩸 R@p¢
📹 Blackmail
🧕 Forced conversions
👶 One girl was brutally forced into ab0rti0n.
6 arrested. Manhunt for others in on.
How many more… pic.twitter.com/IoogUp5eQU
దాదాపు 2 డజన్ల మంది హిందూ యువతుల అశ్లీల చిత్రాలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. వారిలో చాలామందిని ఇస్లాం మతంలోకి మారమని అతను బలవంతం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఒక బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ప్రస్తుతం మిగిలిన అమ్మాయిల వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. నిందితుడు నవేద్ అలియాస్ ఖాసిం పఠాన్‌ని అత్యాచారం, మోసం, బలవంతపు మతమార్పిడి వంటి సెక్షన్ల కింద అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ దర్యాప్తు చేస్తున్నారు.