/rtv/media/media_files/2025/09/27/bareilly-violence-2025-09-27-19-33-51.jpg)
Bareilly Violence
I Love Muhammad : ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో 'ఐ లవ్ ముహమ్మద్' ప్రచారం హింసాత్మకంగా మారింది. ఈ ప్రచారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ ప్రచారానికి కారణమైన స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ఖాన్ ను శనివారం నాడు అరెస్టు చేసింది. శుక్రవారం స్థానికంగా ప్రార్ధనల అనంతరం పెద్దఎత్తున కొత్వాలి ఏరియాలోని మసీదు వెలుపల జనం గుమిగూడటం కలకలం రేపింది. వారంతా 'ఐ లవ్ మహమ్మద్' పోస్టర్లు పట్టుకుని పోలీసులతో ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. రజాఖాన్ ప్రతిపాదించిన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ప్రదర్శన నిలిచిపోవడంతో ఆ గుంపు రెచ్చిపోయింది. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇందుకు బాధ్యులైన రజాతో సహా ఎనిమిది మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని జైలుకు పంపారు. పది ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిలో ఎనిమిది ఎఫ్ఐఆర్‌లలో రజా నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | Uttar Pradesh | On violence in Bareilly, Bareilly SSP Anurag Arya says, "... 10 FIRs have been registered so far... 8 accused have been arrested and sent to judicial custody, namely, Maulana Tauqueer Raza, Sarfaraz s/o Saleem, Manifuddun s/o Zarifuddin, Azeem Ahmed s/o… pic.twitter.com/den4gX8hgX
— ANI (@ANI) September 27, 2025
ఉత్తరప్రదేశ్‌లో "ఐ లవ్ ముహమ్మద్" బ్యానర్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. బరేలీ , మౌ జిల్లాలలో జరిగిన ఘర్షణల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు 30 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు. కొన్ని వారాల కిందట కాన్పూర్‌లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా 'ఐ లవ్ ముహమ్మద్' అని రాసి ఉన్న బ్యానర్‌ను పోలీసులు తొలగించారు. దీంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్థానిక మతాధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో, బరేలీకి చెందిన మత గురువు మౌలానా తౌకీర్ రజా ఖాన్ శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనలకు పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
BIG BREAKING 🚨 Massive tension in Bareilly, UP after Friday prayers 😳
— Times Algebra (@TimesAlgebraIND) September 26, 2025
Muslims with “I Love Muhammad” banner raised provocative slogans.
Stone-pelting erupted. Crowds tried to enter Islamia Ground.
Yogi Police used lathicharge. Heavy force deployed!
pic.twitter.com/ZNctQC26sU
ఐలవ్ ముహమ్మద్ హింసాత్మక ఘటనల అనంతరం రజాతో సహా 8 మందిని పోలీసులు జైలుకు పంపారు. రాళ్లు రువ్వడంతోపాటు విధ్వంసానికి పాల్పడిన మొత్తం 39 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఘటనా జరిగిన మసీదు వెలుపలి స్థలం నుంచి పిస్తోళ్లు, పెట్రోల్ బాటిళ్లు, బాటన్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు బరేలీ ఎస్ఎస్‍పీ అనురాగ్ ఆర్య తెలిపారు. కాగా ఈ హింసాత్మక దాడుల్లో 22 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్టు ఎస్ఎస్‌పీ వివరించారు. వీరిలో పలువురు మారణాయుధాలతో దాడుల కారణంగా గాయపడ్డారని చెప్పారు. 2500 మంది నుంచి 3000 మంది గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఆందోళనలో పాల్గొన్నారని, వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. నదీమ్ అనే వ్యక్తి ఫోన్ కాల్స్, వాట్సాప్‌తో పలువురితో కాంటాక్ట్ జరిపినట్టు తెలిసిందని, ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.
అసలేం జరిగిందంటే...
ఈనెల 4న జరిగిన "ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబి' ఊరేగింపు సందర్భంగా 'ఐ లవ్ మహమ్మద్' బ్యానర్లు ప్రదర్శించడం పై కాన్పూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. వాటిని తొలగించడంతో పాటు 24 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా సంప్రదాయానికి భిన్నంగా, ఇతర మతస్తులను రెచ్చగొట్టేందుకు ఈ బోర్డులు ఏర్పాటు చేశారంటూ పలు హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అనంతరం ఈ వివాదం ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పాకింది. ఉత్తరాఖండ్, కర్ణాటకలోనూ నిరసనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు చర్యలకు దిగారు. అయితే 'ఐ లవ్ మహమ్మద్' అనడం తప్పెలా అవుతుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ ఉన్నది ఎవరో మర్చిపోయావా? సీఎం ఆదిత్యనాథ్ వార్నింగ్
కాగా ఈ అల్లర్లపై స్పందించిన ఉత్తరప్రదేశ్ సీఎం మాట్లాడుతూ ‘‘నిన్న, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో ఒక మౌలానా మర్చిపోయారు” అని ఆదిత్యనాథ్ ఎవరి పేరు చెప్పకుండా అన్నారు. "అతను కోరుకున్నప్పుడల్లా వ్యవస్థల్ని ఆపగలనని అనుకుంటున్నాడు, కానీ మేము రోడ్ బ్లాక్ లేదా కర్ఫ్యూ ఉండదని స్పష్టంగా చెబుతున్నామని'యోగి అన్నారు. "భవిష్యత్ తరాలు అల్లర్లు చేసే ముందు రెండుసార్లు ఆలోచించేలా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 2017 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూను అనుమతించడం లేదని యోగి చెప్పారు.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు