/rtv/media/media_files/2025/07/28/hospital-negligence-2025-07-28-19-05-14.jpg)
Hospital Negligence patient's life was lost
Hospital : వైద్యులను "ధన్వంతరి వారసులు..ధరణిలోన దేవతలు' అని భావిస్తుంటారు. అంటే వైద్యం చేసే డాక్టర్లు భూమిమీద దేవుడితో సమానమని అర్థం. కానీ, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని ప్రాణం పోయాల్సిన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రోగుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. మరికొంతమంది వచ్చిరానీ వైద్యంతో పలువురి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. తాజాగా, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. తీవ్రగాయాలతో ఆస్పత్రికి వచ్చిన బాధితుడికి వైద్యం చేయాల్సిన ఓ డాక్టర్ హాయిగా నిద్రపోయాడు. మిగిలిన డాక్టర్లూ ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. దీంతో తీవ్ర రక్తస్రవం అయి అ పేషేంట్ కనుమూశాడు.
Also Read: మిట్టమధ్యాహ్నం రెచ్చిపోయిన అంకుల్.. ఆంటీతో బైకుపై బంచిక్బంచిక్
ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వైద్యవృత్తికే కళంకం తెచ్చేలా మారింది. ఆదివారం చోటుచేసుకున్నీ ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మీరట్, హాసన్‌పుర్ కాలా గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే యువకుడు ఆదివారం రాత్రి గుర్తుతెలియని ఓ వాహనం ఢీకొనడంతో అతడు తీవ్ర గాయపడ్డాడు. స్థానికుల సమచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సునీల్‌ను మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సునీల్ కుటుంబసభ్యులు, ఊరి పెద్ద జగ్గీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.
सोते रहे डॉक्टर मर गया सुनील!#मेरठ में पश्चिमी यूपी के सबसे बड़े मेडिकल सेंटर LLRM मेडिकल कॉलेज में हादसे में घायल सुनील तड़प तड़प कर मर गया और डॉक्टर सोते रहे
— Narendra Pratap (@hindipatrakar) July 28, 2025
आधी रात को इमरजेंसी में पहुंच सुनील को इलाज नसीब नहीं हुआ. अब मेडिकल प्रशासन ने दो जूनियर डॉक्टर सस्पेंड किए हैं pic.twitter.com/NCTv6y6JBE
Also Read: వీడేం పోలీసురా...ప్రేమ పెళ్లి.. ఆపై వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకుని...
అయితే, అక్కడ సునీల్‌కు వైద్యం చేయడానికి డాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎవరినీ బతిమాలినా పట్టించుకోలేదు. ఓ డాక్టర్ అయితే ఏకంగా కుర్చీలో కూర్చుని నిద్రపోయాడు తప్పితే.. వైద్యం చేయడానికి రాలేదు. కొద్దిసేపటి తర్వాత ఓ డాక్టర్ వారి దగ్గరకు వచ్చాడు. ప్రమాదం గురించి ఏ మాత్రం అడగకుండా, ఎక్స్ రే తీయకుండానే కాలు తీసేయాలని సెలవిచ్చాడు. అలా ఒకే అని ఆపరేషన్ చేయడానికి ఫామ్ మీద సంతకాలు పెట్టమంటూ కుటుంబసభ్యుల్ని బలవంతం చేశాడు.
Also Read: అద్భుతం.. కేవలం రూ.7 వేలతోనే విమానాన్ని తయారు చేసిన యువకుడు
చాలా సేపటి తర్వాత అతడ్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అయితే, అప్పటికే సునీల్ పరిస్థితి విషమించింది. తీవ్ర రక్తస్రావంతో చికిత్సపొందుతూ అతడు చనిపోయాడు. విషయం తెలిసి మరుసటి రోజు ఉదయం పెద్దసంఖ్యలో గ్రామస్థులు మెడికల్ కాలేజీని ముట్టడించారు. కాలేజీ ప్రిన్సిపల్ ఏసీ గుప్తాను కలిశారు. విధుల్లో అలసత్వం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగాఈ విషయమై డాక్టర్ గుప్తా మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా. ఈ విషయమై వారు రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Also Read: ఛీ ఛీ.. గబ్బిలాలతో చిల్లీ చికెన్ - రాష్ట్రంలో బయటపడ్డ మోసం