UP Crime: అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసులు.. బట్టలు చింపి దాడి చేసిన మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే..

 ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులకు ఆ ఇంటి మహిళలు చుక్కలు చూపించారు. నిందితుడి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులపై నిందితుని కుటుంబసభ్యులు దాడి చేశారు.  అందులోనూ మహిళలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు.  

New Update
UP Cops Assaulted By Women

UP Cops Assaulted By Women

UP Crime: ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులకు ఆ ఇంటి మహిళలు చుక్కలు చూపించారు. నిందితుడి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులపై నిందితుని కుటుంబసభ్యులు దాడి చేశారు.  అందులోనూ మహిళలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు.  పోలీసులను గట్టిగా పట్టుకుని ముందుకు కదల నివ్వలేదు. పోలీసుల చొక్కాలు పట్టుకుని వారిని అడ్డుకున్నారు. మహిళలు కావడంతో పోలీసులు వారిని ఏం చేయలేక వారినుంచి విడిపించుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల షర్ట్స్‌ చినిగిపోతున్నా వారు వదల్లేదు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హపుర్‌కు చెందిన అసిఫ్ అనే వ్యక్తి తుపాకులు పట్టుకుని ఉన్న  వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో  పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 ఆ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇల్లీగల్ ఆర్మ్స్ యాక్ట్ కింద అతడిపై కేసు నమోదు చేశారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్థానిక పోలీసులను ఆదేశించారు. ఉన్నతాధికారుల సూచనతో స్పందించిన స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఆదివారం రాత్రి అసిఫ్ ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు ఇంట్లోకి రావడానికి అసిఫ్ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. వారిని అడ్డుకున్నారు. అయినా పోలీసులు వెనక్కు తగ్గలేదు. కుటుంబసభ్యుల్ని తోసుకుంటూ అసిఫ్ ఉన్న గది దగ్గరకు వెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఆసిఫ్‌ కుటంబ సభ్యులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. వారి షర్ట్స్‌ చింపారు.

 పోలీసులను పట్టుకుని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. వారి పట్టునుంచి విడిపించుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎలాగైతేనేం వారి నుంచి విడిపించుకున్న పోలీసులు అసిఫ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ తతంగాన్నంతా పోలీసులు వీడియో తీశారు. మరో వైపు తమపై దాడికి దిగిన ఆరుగురు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వీడియోపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ‘పోలీసులను ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. వారిని ఊరికే వదిలేయకూడదు. కఠినంగా శిక్షించాలి’..కొంతమంది, ‘ఉత్తర ప్రదేశ్‌లో ఇలానే ఉంటుంది’ అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Also Read :  1+1 ఆఫరండీ బాబు.. మొబైల్ కొంటే టీవీ ఫ్రీ.. కొన్ని రోజులు మాత్రమే సమయం!

Advertisment
తాజా కథనాలు