Snake wife: రాత్రికి రాత్రి పాములా మారిపోతున్న భార్య.. గజగజ వణికిపోతున్న భర్త

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య రాత్రి వేళ పాము (నాగిని) రూపంలోకి మారి తనను కాటేయడానికి ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాడు.

New Update
snake wife

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య రాత్రి వేళ పాము (నాగిని) రూపంలోకి మారి తనను కాటేయడానికి ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాడు. మహమూదాబాద్ తహసీల్‌లోని లోధసా గ్రామానికి చెందిన మీరజ్ అక్టోబర్ 4న 'సమాధాన్ దివస్' (ప్రజా సమస్యల పరిష్కార దినం) సందర్భంగా జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ఆనంద్‌కు ఈ మేరకు ఫిర్యాదు అందించారు. తన భార్య నసీమున్ రాత్రిపూట పాములా మారి బుసలు కొడుతూ, కాటేస్తానంటూ తనను భయభ్రాంతులకు గురిచేస్తోందని మీరజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తన భార్య మానసికంగా వేధిస్తోందని, ఏదో ఓ రాత్రి నిద్రలో తనను చంపేస్తుందేమోనని భయంగా ఉందని మీరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చంపడానికి ఆమె చాలాసార్లు ప్రయత్నించిందని, అయితే ప్రతీసారి తానకు మెలకువ వచ్చి తప్పించుకున్నానని తెలిపాడు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించానని మీరజ్ వివరించాడు.

ఈ ఫిర్యాదుతో అక్కడున్న అధికారులు ఆశ్చర్యపోయినా, జిల్లా మేజిస్ట్రేట్ దీనిని సీరియస్‌గా తీసుకుని విచారణ జరపాలని, తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. భర్తని మానసికంగా వేధిస్తున్న కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ వింత ఫిర్యాదు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు