ఇదే మావా అసలైన అదృష్ణమంటే.. దెబ్బకు రూ.35 కోట్లు సొంతం

సందీప్ కుమార్ ప్రసాద్ దుబాయ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్, గత మూడు సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబిలో జరిగిన బిగ్ టికెట్ లాటరీలో సందీప్‌కు జాక్‌పాట్ తగిలింది.

New Update
sandeep kumar prasad

ఓ వ్యక్తిని అదృష్టం ఎగిరి వచ్చి తంతే గారెల బుట్టలో కాదు.. నోట్ల కట్టల కుప్పలో పడ్డాడు. బతుకుదెరుకు కోసం దుబాయ్ పోయిన యువకుడికి అదృష్టం కలిసి వచ్చింది. 30ఏళ్ల సందీప్ కుమార్ ప్రసాద్ దుబాయ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్, గత మూడు సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబిలో జరిగిన బిగ్ టికెట్ లాటరీలో సందీప్‌కు జాక్‌పాట్ తగిలింది. ఇతను అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో Dh15 మిలియన్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.35 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో సందీప్ ఒక్క రోజులో కోటీశ్వరుడు అయ్యాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు అదృష్టం అంటే నీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయన గురించి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

20 మంది ఫ్రెండ్స్‌లో లాటరీ టికెట్

సందీప్ ఈ లాటరీ టికెట్‌ను ఒక్కడే కొనుగోలు చేయలేదు. తనతో పాటు పనిచేసే మరో 19 మంది స్నేహితులతో కలిసి టికెట్ కొన్నారు. ప్రతి ఒక్కరూ కొంత మొత్తాన్ని పోగు చేసి, టికెట్ నంబర్ 200669ను కొనుగోలు చేశారు. ఆగస్ట్ 19న కొన్న ఈ టికెట్, సెప్టెంబర్ 3న జరిగిన డ్రాలో విజేతగా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న సందీప్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "నా జీవితంలో ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను" అని సందీప్ అంటున్నాడు. 

లాటరీ డబ్బుతో స్వదేశానికి తిరిగి వచ్చి వ్యాపారం

లాటరీ గెలుచుకున్న తర్వాత సందీప్ తన ప్లానింగ్ గురించి మీడియాకు చెప్పాడు. లాటరీ డబ్బుతో స్వదేశానికి తిరిగి వచ్చి, తన కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ డబ్బుతో తన తండ్రికి మంచి వైద్యం అందించడంతో పాటు, భారతదేశంలో సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. తనకు ఈ విజయాన్ని తెచ్చి పెట్టిన బిగ్ టికెట్‌కు ధన్యవాదాలు చెప్పాడు. లాటరీ టికెట్  చేయాలనుకునే వారిని సందీప్ ప్రోత్సహిస్తున్నాడు. 

Advertisment
తాజా కథనాలు