USA: ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని
వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నిన్న ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నిన్న ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అక్రమ వలసదారులను అమెరికా వెనక్కు పంపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బ్రెజిల్, కొలంబియా. తమ దేశ పౌరుల చేతులకు సంకెళ్ళు వేసి పంపించడం వారి పౌర హక్కులను కాలరాసినట్టే అని వ్యాఖ్యానించాయి. వారితో వస్తున్న విమానాలను అనుమతించమని స్పష్టం చేశాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా నుంచి సాయం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ట్యాక్స్ వసూళ్లు చేసే 'ఇంటర్నెల్ రెవెన్యూ సర్వీస్'లో కొత్తగా చేరిన 90 వేల మంది ఏజెంట్లను సరిహద్దులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. లేదా తొలగిస్తామన్నారు. వాళ్లకు తుపాకులు ఇచ్చి సరిహద్దుకు పంపిస్తామన్నారు.
అక్రమ వలసల చట్టాన్ని అమెరికాలో అధికారులు మహా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరేం చేసినా వెంటనే పట్టుకుంటున్నారు. తాజాగా పార్ట్ టైమ్ చేసుకుంటున్న ఇద్దరు విద్యార్ధులను అధికారులు పట్టుకున్నారు.
దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి మంటలు చెలరేగాయి. 8వేల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్క రోజులోనే 41 చ.కి.మీ. విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం ప్రకటించింది. దీంతో పాటూ అలస్కన్ శిఖరం డెనాలిని పేరును కూడా మౌంట్ మెకిన్లీగా మార్చారు.
రష్యా,ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో ట్రంప్ గెలిచి ఉంటే అసలు యుద్ధమే జరగకుండా ఆపేవారని అన్నారు. దాంతో పాటూ ట్రంప్ పై బోలెడు ప్రశంసలు జల్లులు కురిపించారు.
అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికి 538 మందిని అరెస్ట్ చేశారు మరో 373మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోందని వైట్ హౌస్ ట్వీట్ చేసింది.