/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
మీకు అమెరికా పౌరసత్వం కావాలా...అయితే రియాలిటీ షో ఆడాల్సిందే అంటోంది అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ. ఇందులో ఆడి, అమెరికాపై తమ దేశభక్తిని నిరూపించుకుంటే పౌరసత్వాన్ని ఇస్తామని చెబుతోంది. అమెరికాలోని వలసదారులకు తాత్కాలిక రక్షణ హోదాను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం చూస్తున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ ఆలోచన పరిశీలన దశలో ఉంది. కానీ ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ చాలా గట్టిగానే ఉందని అంటున్నారు. పౌరసత్వం కోసం ఇప్పటికే గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Also Read : వైద్య విధానంలో కొత్త ఆవిష్కరణ.. ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్!
Also Read : పీఎస్‌ఎల్వీ సీ 61 రాకెట్ ప్రయోగం విఫలం ?
అవును నిజమే పరిశీలనలో ఉంది..
ఈ రియాలిటీ షో ప్రతిపాదనను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ధృవీకరించింది. ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపింది. అయితే ఇప్పటివరకు ఉన్న విధానాలను దాటి కొత్తగా ఆలోచించనున్నట్లు తెలిపింది. ఈ రియాలిటీ షో అందులోని భాగమే అని చెప్పింది. ఈ రియాలిటీ షోకు హాజరైన వారు.. పలు టాస్క్‌ల్లో తమకు అమెరికాపై ఎంత దేశభక్తి ఉంది అనేది నిరూపించుకోవాల్సి ఉంటుందని సమాచారం. గోల్డ్ రష్, కార్ అసెంబ్లీ లాంటి గేమ్స్ ఇందులో ఉండొచ్చని చెబుతోంది. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ హంగర్ గేమ్ లా మాత్రం ఉందని చెప్పింది. ఎల్లిస్ ఐలాండ్ లో దీనిని నిర్వహించనున్నారు. ప్రతీవారం ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చని అంటున్నారు. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అసాధారణ పరిస్థితుల వల్ల స్వదేశానికి సురక్షితంగా తిరిగి వెళ్లలేని విదేశీ పౌరుల కోసం దీని ద్వారా తాత్కాలిక రక్షణ హోదాను ఇస్తారు.
Also Read : జ్యోతి ఇంస్టాగ్రామ్ లో షాకింగ్ విషయాలు...పహల్గాం సమాచారం చేరవేత ?
Also Read : 'విరాట్ కోహ్లీకి భారతరత్న'
today-latest-news-in-telugu | usa | american-citizenship | game-show | international news in telugu | latest-telugu-news | telugu-news | Donald Trump | today-news-in-telugu
Follow Us