/rtv/media/media_files/2025/05/21/KI42ODT9OR1jMOjtKpEO.jpg)
Iran- Israel
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో హౌతీలతో పాటూ ఇరాన్ కూడా ఉంది. హమాస్ కు మద్దతుగా హౌతీలు, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేశాయి. దీంతో ఐడీఎఫ్ కూడా ఆ రెండు దేశాలపైనా అడపాదడపా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని అమెరికా నిఘా వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే ఇది ఇంకా ఆలోచన స్థాయిలోనే ఉందని..ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ అలాంటి దాడి చేస్తుందా లేదా అనే దానిపై అమెరికా ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వాషింగ్టన్ లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో సంప్రదించినప్పటికీ వారు వెంటనే స్పందించలేదని తెలుస్తోంది.
అణు ఒప్పందంపైనే ఆధారపడి..
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయాలని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో అనుకుంటోందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ దాడుల అవకాశాలు మరింత పెరిగాయని చెబుతున్నారు. అలాగే అమెరికా, ఇరాన్ మధ్య యురేనియం ఒప్పందం కుదిరితే కనుక ఇజ్రాయెల్ దాడులు చేసే మరింత అవకాశాలు ఎక్కువ అవుతాయని అంటున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెర్షన్ మరోలా ఉంది. ఇజ్రాయెల్ తో ఉమ్మడి సైనిక చర్యలు చేసేకన్నా..ఇరాన్ తో అణు ఒప్పందానికి తాను ఇష్టపడతానని ఆయన చెప్పారు. అందుకే తాను ఇరాన్ తో అణు ఒప్పందం చర్చలు చేయడానికి వెళ్ళానని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చూడాలి.
today-latest-news-in-telugu | iran | israel | usa | nuclear