US Visas: వాళ్ల వీసాలు రద్దు చేస్తూనే ఉంటాం.. అమెరికా వార్నింగ్

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ రూల్స్ ఉల్లంఘించే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. సెనెట్‌లో డెమోక్రట్లతో జరిగిన మీటింగ్‌లో ఆయన దీనిగురించి మాట్లాడారు.

New Update
US Secretary of State Marco Rubio

US Secretary of State Marco Rubio

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూల్స్ ఉల్లంఘించే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. సెనెట్‌లో డెమోక్రట్లతో జరిగిన మీటింగ్‌లో ఆయన దీనిగురించి మాట్లాడారు. అమెరికా విదేశాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే పనులను తొలగించేందుకు.. చట్టం ప్రకారం వీదేశీయుల వీసాలు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. 

Also Read: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..

'' వీసా అనేది హక్కు కాదు. సౌకర్యం మాత్రమే. ఇక్కడికి అతిథులుగా వచ్చి.. మనవద్ద ఉన్న విద్యా సౌకర్యాలకు అంతరాయం కలిగిస్తున్న వ్యక్తుల వీసాలు రద్దు చేస్తూనే ఉంటామని'' మార్కో రూబియో తెలిపారు. మరోవైపు అమెరికాలో వాక్‌ స్వాతంత్ర్యాన్ని రూబియో ఉల్లంఘిస్తున్నారని డెమోక్రటిక్ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ను విమర్శించే వాళ్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు.  ఈ క్రమంలోనే వీటికి స్పందిస్తూ తాజాగా రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: రూ.142 కోట్లు నొక్కేశారు.. రాహుల్‌, సోనియాలపై ఈడీ సంచలన ఆరోపణలు

అమెరికా విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇది వాక్‌ స్వాతంత్ర్యపు హక్కును ఉల్లంఘించడమేనని డెమోక్రటిక్ నేత వాన్‌ హొలెన్‌ రూబియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన రూబియో.. లైబ్రరీలను స్వాధీనం చేసుకొని.. బిల్డింగ్‌లను తగలబెట్టేందుకు యత్నించే స్టూడెంట్స్‌నే తాను టార్గెట్ చేసుకున్నట్లు స్పష్టం చేశారు.  

Also Read: పాక్ కు చుక్కలు చూపించిన మన S- 400, ట్రంప్ గోల్డెన్ డోమ్ కు తేడా ఏంటో తెలుసా?

ఇదిలాఉండగా.. చాలామంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తూ సెటల్ అవ్వాలనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో ఉద్యోగాలు దొరకడం చాల కష్టంగా మారిపోయింది. విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని విద్యార్థులు కలలు కనడం మానుకోవాలని హర్యానాకు చెందిన రాజేష్ సాహ్నీ అనే పారిశ్రామికవేత్త సూచించారు. ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో ఇంటర్నేషనల్ విద్యార్థులకు జాబ్స్‌ లేవని.. ముఖ్యంగా ఐఐటీ చేసిన ఇంజినీర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

Also Read: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు.. విచారణలో బయటపడ్డ షాకింగ్ విషయాలు

 national-news | telugu-news | rtv-news

Advertisment
తాజా కథనాలు