/rtv/media/media_files/2025/05/21/mISkCK7m64Mo5m1Idbxo.jpg)
Golden dome VS S-400
మే 8-9 రాత్రి గుర్తుందా? పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణులతో బాంబు దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారత వైమానిక స్థావరాలు పాకిస్తాన్ క్షిపణి దాడులకు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిల్లో భారతదేశ క్షిపణి రక్షణ వ్యవస్థ పాకిస్తాన్‌కు అద్భుతమైన సమాధానం ఇచ్చింది. దీంతో భారత్‌లో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం కూడా జరగలేదు. దీనికి ముఖ్యకారణం మనకు పటిష్ఠమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండటం వల్లే. అందులో కీలకమైనది S-400 మిసైల్ సిస్టమ్. ఈ S 400 మిసైల్ సిస్టమ్ పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్లను తిప్పికొట్టి గాల్లోనే పేల్చివేసింది. రష్యా నుంచి ఈ సిస్టమ్ ను కొనుగోలు చేసింది భారత్. దీని కోసం 35 వేల కోట్ల పెట్టుబడిని పెట్టింది. సుదర్శన చక్రగా పిలిచే ఈ ఎస్-400 మిసైల్ సిస్టమ్.. దేశంలో ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో మోహరించారు. యుద్ధ విమానాలతో పాటు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు లాంటి అనేక వైమానిక దాడులను ముందుగానే వాటిని గాల్లోనే పేల్చేయగల సామార్థ్యం దీనికి ఉంటుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ 17000 కి.మీ వేగంతో పనిచేస్తుంది. ఇది దాదాపుగా 400 కి.మీ వరకు ఉన్న శత్రుదాడులను కూడా ఈజీగా గుర్తిస్తుంది. ఒకేసారి 36 క్షిపణులను టార్గెట్ చేసి వాటిని నాశనం చేస్తుంది. అలాగే ఒకే కోణంలో కాకుండా 360 డిగ్రీల కోణంలో వచ్చిన వాటిని కూడా ధ్వంసం చేస్తుంది.
అమెరికా గోల్డెన్ డోమ్..
ఇప్పుడు అమెరికా కూడా ఎస్-400 మిసైల్ సిస్టమ్ లాంటి దాన్నే ఏర్పాటు చేస్తానని చెబుతోంది. మూడేళ్ళల్లో అమెరికాకు రక్షణ కవచాన్ని పెట్టేస్తామని ట్రంప్ ఈరోజు ప్రకటించారు. అసలు ఎందుకు అమెరికా గోల్డెన్ డోమ్ కోసం అంత తొందరపడుతోంది. పెద్దన్న అసలు ముప్పు ఎక్కడ నుంచి ఉంది అంటే...పెద్ద ముప్పే ఉందని చెబుతున్నారు. రష్యా, చైనా, హౌతీల నుంచి దాడులు జరగొచ్చని అంటున్నారు. హౌతీలు ఇప్పటికే చాలా సార్లు దాడులు చేశాయి. అలాగే ఇరాన్ తో అణు ఒప్పందం కుదరకపోతే..ఆ దేశం నుంచి కూడా తప్పవని అంటున్నారు. ఇక ఉత్తర కొరియా నుంచి కూడా ముప్పు ఉందని అమెరికా అంచనా వస్తోంది. అందుకే తమ దేశానికి గోల్డెన్ డోమ్ అత్యంత అవసరమని ట్రంప్ భావిస్తున్నారు. దీని కోసం 175 బిలియ్ డాలర్ల ఖర్చు పెడుతున్నారు కూడా.
గోల్డెన్ డోమ్, S-400 మిసైల్ సిస్టమ్ కు మధ్య తేడా..
భారత దేశం దగ్గర ఉన్నది బ్యాటరీ ఆధారిత మిసైల్ సిస్టమ్. ఇది మనల్ని పాక్ క్షిపణుల నుంచి కాపాడింది. అయితే అమెరికా ఏర్పాటు చేస్తున్న గోల్డెన్ డోమ్ మన దానికన్నా అడ్వాన్స్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఇది ఏకంగా ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుంది. గోలెడ్న్ డోమ్ కేవలం భమి మీద ఉన్న దేశాల నుంచే కాదు అంతరిక్షంలో నుంచి దాడులు చేసినా కూడా రక్షించగలదు. గోల్డెన్ డోమ్ అన్ని హైపర్సోనిక్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, అధునాతన క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే నాశనం చేస్తుంది. ఇది బహుళ పొరలను కలిగి..ఇంటర్ సెప్టర్ గా పని చేస్తుంది. 360 డిగ్రీల ముప్పును గుర్తించగలదు. ఈ రక్షణ వ్యవస్థ అంతరిక్ష ఆధారిత సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది. 1000 కంటే ఎక్కువ ఉపగ్రహాల నెట్‌వర్క్‌కు అనుసంధానించబడి ఉంటుంది. గోల్డెన్ డోమ్ దీర్ఘ శ్రేణి క్షిపణులను కూడా గాల్లోనే నాశన చేయగలదు. ఎలా చూసినా ఇది మన S-400, S-500 కన్నా సామర్ధ్యం ఎక్కువ గలది అని తెలుస్తోంది.
today-latest-news-in-telugu | usa | india | s 400 missile
Also Read: Stock Market: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు