/rtv/media/media_files/2025/05/17/ULLQdQX1lk3hZMKS6bqZ.jpg)
US Embassy in India issues warning, Overstaying visas could lead to deportation
అమెరికాకు వెళ్లాక కొందరు నిర్దేశిత గడువు దాటినా కూడా అక్కడే ఉండిపోతుంటారు. అయితే తాజాగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. గడువు దాటినా కూడా అమెరికాలో ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. వాళ్లకి బహిష్కరణ ముప్పు తప్పదని.. అలగే భవిష్యత్తులో అమెరికాకు వెళ్లకుండా శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పింది.
Also Read: కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే మీ స్పెర్మ్ కౌంట్ను చెక్ చేసుకోండి!
US Embassy In India
టూరిజం, స్టూడెంట్, వర్క్ పర్మిట్స్‌తో పాటు వివిధ వీసాల పై అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ఈ హెచ్చరిక జారీ చేసింది.నిర్దేశిత గుడువు ముగిశాక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేందుకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ను సంప్రదించాలని అధికారులు సూచనలు చేశారు. ఇదిలాఉండగా అమెరికాలో గడువు దాటి ఉంటున్నవారు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ గతంలోనే హెచ్చరించింది.
'' అమెరికాలో 30 రోజులకు రూల్స్‌కు మించి నివసిస్తున్న వాళ్లు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రూల్‌ను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణిస్తాం. రుసం, జైలు శిక్ష విధిస్తాం. అందుకే వెంటనే వెళ్లిపోవాలని'' చెప్పింది. మరోవైపు ఫైనల్ ఆర్డర్ అందుకున్న వాళ్లు ఒక్కరోజు ఎక్కువగా ఉంటే రోజుకి 998 డాలర్ల ఫైన్ చెల్లించాలి. సొంతంగా వెళ్లకపోతే వెయ్యి నుంచి 5 వేల డాలర్ల ఫైన్ వేయనున్నారు. అలాగే వీళ్లకు జైలుశిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని.. భవిష్యత్తులో వాళ్లు చట్టపరంగా అమెరికాకు కూడా రాలేరు.
Also Read: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !
Also Read : మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ.. విద్యార్థిని కిడ్నాప్ చేసి.. మూత్రం తాగించి ( సెల్ఫీ వీడియో వైరల్)
rtv-news | usa | embassy | visa