Tornado: అమెరికాలో తుఫాను బీభత్సం.. 21 మంది మృతి

అమెరికాలోని మిస్సౌరి, కెంటకీ రాష్ట్రాల్లో తీవ్రమైన తుఫానులు, టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ విషాద ఘటనలో 21 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.

New Update
At least 21 dead in Missouri, Kentucky as severe storms sweep central USA

At least 21 dead in Missouri, Kentucky as severe storms sweep central USA

అమెరికాలోని మిస్సౌరి, కెంటకీ రాష్ట్రాల్లో తీవ్రమైన తుఫానులు, టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ విషాద ఘటనలో 21 మంది మృతి చెందారు. కెంటకీలోనే ఏకంగా 14 మంది మరణించినట్లు అక్కడి గవర్నర్ ఆండీ బెషీర్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి టొర్నడో సంభవించిందని.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఆయన ఎమర్జెన్సీ ప్రకటించారు. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో అక్కడ లక్షలాది మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారు.    

Also Read: రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న భార్య.. పట్టించిన జూమ్ కాల్.. కోర్టు ట్విస్ట్ అదిరింది!

ఇక మిస్సౌరీలోని సెయింట్‌ లూయిస్‌లో శుక్రవారం తుఫాను ధాటికి ఐదుగురు మృతి చెందారు. ఇక్కడ దాదాపు 5 వేల కన్నా ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. అలాగే టోర్నడో గ్రామీణ ప్రాంతాల వైపు దూసుకెళ్లడంతో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ తుఫానులు గురువారం నుంచి శనివారం వరకు 24 రాష్ట్రాల్లో 1500కు పైగా తీవ్ర వాతావరణ రిపోర్టులను రికార్డు చేశాయి.    

Also read: బ్యాండేజ్ సె*క్స్ చేస్తుండగా భార్య మృతి.. పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్!

కెంటకీ, టెన్నెస్సీలలో వరద ముప్పు (లెవెల్ 2/4) ఉన్నట్లు నేషనల్ వెదర్ సర్వీస్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆదివారం నాటికి ప్లెయిన్ ప్రాంతంలో మరిన్ని ఎక్కువ టొర్నడోలు రావచ్చొని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈశాన్య టెక్సాస్ నుంచి మిడ్‌ అట్లాంటిక్‌ దాకా 1200 మైళ్ల విస్తీర్ణంలో వాతవరణం తీవ్రంగా ఉందని హెచ్చరికలు చేశారు. 

Also Read: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !

Also Read: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. 20 మంది మావోయిస్టు నేతలు అరెస్ట్‌!?

 rtv-news | usa | cyclone | tornodo

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు