/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
Indian Origin Businessman Shot dead in USA
అమెరికాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. టెక్సాస్‌లోని ఆస్టిన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అతడు ఓ బస్సుల్లో ప్రయాణిస్తుండగా అతనిపై మరో భారతీయుడు దాడి హత్య చేశాడు. అమెరికాలో ఒక భారత సంతతికి చెందిన వ్యక్తిని.. మరో భారతీయుడు హత్య చేయడం కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: బెయిల్ ఇచ్చేందుకు ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిన పని లేదు: సుప్రీంకోర్టు
ఇక వివరాల్లోకి వెళ్తే భారతీయ సంతతికి చెందిన అక్షయ్ గుప్తా (30) హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీకి కో ఫౌండర్‌గా ఉన్నాడు. మే 14న టెక్సాస్‌లో ఆయన ఓ బస్సులో వెళ్తున్నారు. ఆయన వెనకాలే మరో భారతీయుడు దీపక్ కండేల్ కూర్చొన్నాడు. బస్సు ప్రయాణిస్తుండగానే దీపక్.. గుప్తాపై కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం మేరకు అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: TIME100 దాతృత్వ జాబితాలో మొదటిసారి అంబానీ.. ఎన్ని వేల కోట్లు దానం చేశారంటే?
నిందితుడు దీపక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అతడు షాకింగ్ విషయం వెల్లడించాడు. అక్షయ్ గుప్తా తన మామలా కనిపించాడని.. అందుకే తాను అతడిని కత్తితో పొడిచి హతమార్చానని చెప్పాడు. దీంతో పోలీసులు షాకైపోయారు. అయితే అక్షయ్ గుప్తా పెన్‌స్టేడ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. కొత్త ప్రాజెక్టు కోసం ఇటీవల మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్లను కూడా కలిశారు.
Also Read: విద్యార్థులకు షాక్.. అమెరికా, బ్రిటన్, కెనడాల్లో ఉద్యోగాల్లేవు
Also Read: ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు..అమెరికాకు నిఘా సమాచారం
usa | telugu-news | murder | rtv-news | national-news