USA: క్షిపణుల నుంచి రక్షణకు గోల్డెన్ డోమ్..ట్రంప్ ప్రకటన

అమెరికాను మిస్సైల్స్ నుంచి రక్షించుకోవడానికి గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. మూడేళ్ళల్లో దీని ఏర్పాటు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ గోల్డెన్ డోమ్ కోసం ట్రంప్ 175 మిలియన్ డాలర్లను ఖర్చు చేయున్నారు. 

New Update
Trump

Trump

అమెరికా ప్రజలకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తానని అధ్యక్షుడు ఎన్నికల సమయంలో మాటిచ్చారు. అన్నట్టుగానే ఇప్పుడు అమెరికాను క్షిపణుల బారి నుంచి రక్షించడానికి గోల్డెన్ డోమ్ ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూడేళ్ళల్లో దీన్ని ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మొదటి విడతలో గోల్డెన్ డోమ్ కోసం 25 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నామని...పూర్తయ్యేటప్పటకి 175 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని చెప్పారు. 

అమెరికాను ఎవరూ ఏం చేయలేరు..

ఈ గోల్డెన్ డోమ్  ద్వారా ప్రపంచంలోని ఏ వైపు నుంచి ఎవరు మిస్సైల్స్ ను ప్రయోగించినా...చివరకు అంతరిక్షం నుంచి దాడి చేసినా కూడా అడ్డుకోవచ్చును. గోల్డెన్ డోమ్ ఉన్నంతకాలం అమెరికాను ఎవరూ ఏమీ చేయలేరు. ఇది అమెరికా సాధిస్తున్న మరో గొప్ప విజయం. దేశ ప్రజల మనుగడకు ఎంతో ముఖ్యమైన ముందడుగు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచానికి అమెరికా అంతరిక్ష దళం జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా, రష్యా నుండి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి ఇది రూపొందించబడిందని చెప్పారు. అమెరికా సైనిక వ్యూహంలో ఇదొక భాగమని ట్రంప్ తెలిపారు. అమెరికా అంతరిక్ష, క్షిపణి రక్షణ సామర్థ్యాలను పెంచడంలో కీలకమైన దశగా దీనిని ఆయన అభివర్ణించారు. 

జనరల్ మైఖేల్ గుట్లీన్ ఎవరు?

మైఖేల్ ఆంథోనీ గుట్లీన్ యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ జనరల్.  ప్రస్తుతం ఈయన అంతరిక్ష కార్యకలాపాల రెండవ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. గుట్లీన్ 2021 నుండి 2024 వరకు స్పేస్ సిస్టమ్స్ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఆ తరువాత  2019 నుండి 2021 వరకు నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1967లో జన్మించి గుట్లీన్.. ఒక్లహోమాలో పెరిగి...అక్కడే స్టేట్ యూనివర్శిటీ నుండి పట్టా పొందారు.  తర్వాత 1991లో యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళంలో చేరారు. మైఖేల్ గుట్లీన్ తన కెరీర్ మొత్తంలో అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నారు. డిఫెన్స్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ మెడల్, ఎయిర్ ఫోర్స్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ మెడల్, డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్, రెండు లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డులు ఉన్నాయి. 

today-latest-news-in-telugu | usa | trump | balistic-missiles | defence | program

Also Read: Booker Prize: కర్ణాటక రచయిత్రికి ప్రఖ్యాత బుకర్ ప్రైజ్

Advertisment
తాజా కథనాలు