Crime: కరీంనగర్ మెడికల్ కాలేజీలో కలకలం.. బుర్కాతో మహిళల బాత్రూంలోకి దూరి..!
కరీంనగర్ జిల్లాలోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో దొంగలు కలకలం సృష్టించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ శివారులో ఉన్న ఈ మెడికల్ కాలేజీలో ఏకంగా ఒక మహిళ మెడలో చైన్ దొంగిలించే ప్రయత్నం చేసి అక్కడి వారికి దొరికిపోవడం సంచలనం సృష్టించింది.