/rtv/media/media_files/2025/09/05/uproar-at-karimnagar-medical-college-2025-09-05-12-28-13.jpg)
Karimnagar Medical College..
Crime:కరీంనగర్ జిల్లాలో ప్రముఖ మెడికల్ కాలేజీ అయిన చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో దొంగలు కలకలం సృష్టించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ శివారులో ఉన్న ఈ మెడికల్ కాలేజీలో ఏకంగా ఒక మహిళ మెడలో చైన్ దొంగిలించే ప్రయత్నం చేసి అక్కడి వారికి దొరికిపోవడం సంచలనం సృష్టించింది. అయితే మెడికల్ కాలేజీలో మహిలల బాత్రూలను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీకి యత్నించడంతో స్థానికంగా కలకలం రేగింది. మహిళలు వాష్ రూమ్‌లకు వెళ్లిన సమయంలో వారి మెడలోని నగలను చోరీ చేయడానికి దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ మహిళతో పాటు ఒక పురుషుడు బుర్కాలు ధరించి మహిళల వాష్ రూమ్‌ల్లో దూరినట్లు తెలిసింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: మాజీ స్టార్ క్రికెటర్‌కు ఈడీ సమన్లు
మహిళలు వాష్ రూం వెళ్లేందుకు లోపలికి రాగానే వారిని అటకాయించి వారి మెడలోని నగలను దోచుకుని ఆపై వాష్ రూం గడియపెట్టి పారిపోయేందుకు దొంగలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో గత కొంతకాలంగా నిందితులు రెక్కీ నిర్వహించి ఆసుపత్రి మహిళా వాష్‌రూములను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక మహిళ మెడలోని నగలు కొట్టేయడానికి ప్రయత్నించి దొరికిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: AP Govt: ఏపీ సర్కార్ కొత్త చట్టం.. తప్పుడు పోస్టులు పెడితే జైలుకే!
నిందితులిద్దరూ బుర్కాలు ధరించి వాష్ రూములోకి చొరబడ్డారు. అక్కడే ఉన్న ఓ మహిళమెడలోని నగలను చోరీ చేసే ప్రయత్నం బెడిసికొట్టి దొరికిపోయారు. దీంతో బాధిత మహిళ బంధువులు వారిని పట్టుకుని చెప్పులతో బాదుతూ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వాష్ రూం లో చొరబడ్డ మహిళాతో పాటు బుర్కా ధరించిన వ్యక్తి దొంగతనానికే వచ్చారా లేక మరేదైన కారణంతో వచ్చారా? మెడికల్ కాలేజీలో అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు వచ్చారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే రెండు మూడు జిల్లాల పరిధిలో గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీలో ఆసుపత్రికి వచ్చే వారికి భద్రత కల్పించాల్సిన యాజమాన్యం భద్రతను గాలికి వదిలేయడంతో చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో సరైన చర్యలు చేపట్టాలని పేషేంట్స్ కోరుతున్నారు.