HCU : సెంట్రల్ యూనివ‌ర్సిటీలో భారీ చోరీ.. కిటికీ గ్రిల్స్‌ తొలగించి 50 ల్యాప్‌టాప్‌లతో జంప్

హైదరాబాద్‌ గ‌చ్చిబౌలిలోని హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలో ఉన్న ప్రతిష్టాత్మక సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ చోరీ జ‌రిగింది. రూ. 25 ల‌క్షల విలువైన 50 ల్యాప్‌టాప్‌ల‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు అప‌హ‌రించడం సంచలనంగా మారింది.

New Update
FotoJet (5)

Massive theft at Central University.

HCU : హైదరాబాద్‌ గ‌చ్చిబౌలిలోని హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలో ఉన్న ప్రతిష్టాత్మక సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ చోరీ జ‌రిగింది. రూ. 25 ల‌క్షల విలువైన 50 ల్యాప్‌టాప్‌(laptops) ల‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు అప‌హ‌రించడం(theft) సంచలనంగా మారింది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్(hyderabad central university latest news) కు సంబంధించిన ఓ త‌ర‌గ‌తి గ‌ది కిటికీ గ్రిల్స్‌ను చాక‌చ‌క్యంగా తొల‌గించారు. అనంత‌రం దుండ‌గులు లోప‌లికి ప్రవేశించి 50 ల్యాప్‌టాప్‌ల‌ను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం తరగతి గదిలో  ల్యాప్‌టాప్‌లు మాయం కావడంతో వర్సిటీ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు తరగతి గది కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడం, కారు టైర్ గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే దొంగిలించిన ల్యాప్‌టాప్‌ల‌ను కారులో త‌ర‌లించిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. యూనివ‌ర్సిటీ సెక్యూరిటీ ఫిర్యాదు మేర‌కు గ‌చ్చిబౌలి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. కారు నంబ‌ర్ ఆధారంగా దొంగ‌ల‌ను గుర్తించే ప‌నిలో పోలీసులు నిమ‌గ్నమ‌య్యారు. వివరాల కోసం హెచ్సియులోని సీసీ కెమెరాలను మొత్తం పరిశీలిస్తున్నారు.

Also Read :  జగిత్యాలలో ఆగని రాజకీయ జగడం... ఎమ్మెల్యే సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన జీవన్ రెడ్డి

Massive Theft At Central University

పోలీసుల దర్యాప్తులో భాగంగా సి.ఆర్. రావు ఇన్‌స్టిట్యూట్, వర్సిటీ ప్రధాన ద్వారాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. దొంగలు ల్యాప్‌టాప్‌లను ఒక కారులో తరలించినట్లు కెమెరాల్లో రికార్డు అయ్యింది. అయితే నిందితులు క్యాంపస్(hcu campus) లోపలికి ఎలా ప్రవేశించారు? వారికి లోపలి వ్యక్తుల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివరాల కోసం హెచ్సియులోని సీసీ కెమెరాలను మొత్తం పరిశీలిస్తున్నారు.
 
అయితే ల్యాప్ టాప్‌లు చోరీకి గురి కావడంతో విద్యార్థులు(hcu students) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్ట్ డేటా, పరిశోధనలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా వాటిల్లోనే ఉందని, అవి దొరకకపోతే తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులు ట్యాప్‌ టాప్‌లను ఫార్మాట్‌ చేయకముందే పట్టుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉండే యూనివర్సిటీలో చోరీ జరగడం కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  బీజేపీ నేత ఆత్మ*హత్యకు కారణం వారే.. సామ సంచలన ఆరోపణలు!

Advertisment
తాజా కథనాలు