/rtv/media/media_files/2025/09/21/the-man-who-robbed-a-friends-house-2025-09-21-12-40-30.jpg)
The man who robbed a friend's house
మనుషులు జల్సాలకు అలవాటు పడి అప్పులపాలు అవుతూ.. దొంగతనాలు(Theft), మోసాలు చేస్తున్నారు. డబ్బు కోసం మన, తన అనే తేడాలు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఒకటి నగరంలో చోటుచేసుకుంది. డబ్బు కోసం తన స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ మిత్రుడు. స్నేహితుడి ఇంట్లో బంగారం, డబ్బులు ఉన్నాయని తెలుసుకుని.. దొంగతనానికి పాల్పడ్డాడు. లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొన్న వ్యక్తి వాటితో జల్సాలు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు. తనను గుర్తు పట్టొద్దని లేడీగెటప్ వెళ్లి మరి చోరీ చేశాడు, కానీ చివరికి దొరికిపోయాడు... హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో స్నేహితుడి ఇంట్లో నగలు, డబ్బు చోరీ చేసిన ఓ టెక్నీషియన్ ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
Also Read : గూగుల్, యూట్యూబ్‌లో చూసి యువకుడు దారుణం.. సినిమా రేంజ్‌లో ఛేజ్!
Debts On A Loan App
హైదరాబాద్(Hyderabad), బంజారాహిల్స్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఈ నెల 16 న కుటుంబ సభ్యులతో కలిసి తన సొంత ఊరు అయిన నిజామాబాద్ వెళ్లాడు. ఊరికి వెళ్తున్న విషయాన్ని తన స్నేహితుడు అయిన హర్షిత్‌కు చెప్పాడు. అయితే అప్పటికే.. పలు యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకున్న హర్షిత్ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి ఉన్నాడు. అదే అదునుగా భావించిన అతను శివరాజ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అయితే దానికోసం ఆడవేషం వేసి మరి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం ఇంట్లో ఉన్న 6.75 తులాల బంగారం, రూ. 1.10 లక్షల నగదు తీసుకుని బయటపడ్డాడు. శివరాజ్ కుటుంబంతో కలిసి ఊరి నుంచి ఇంటికి వచ్చేటప్పటికీ ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో బంగారం, నగదు లేకపోవడంతో.. హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో వివరాలను సేకరించారు. హర్షిత్ ఆడవేషంలో.. చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు గుర్తించారు. వాటి ఆధారంగా హర్షిత్ చోరీకి పాల్పడ్డట్లు నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. హర్షిత్‌ను అరెస్ట్ చేసి.. అతని వద్ద నుంచి 6.75 తులాల బంగారం, రూ. 85 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?