Chat GPT: లంబోర్గిని కారు చోరీ..కనిపెట్టిన చాట్ జీపీటీ

మనుషుల జీవితాల్లోకి ఏఐ విపరీతంగా చొచ్చుకుని వచ్చేసింది. అప్పుడప్పుడు మనుషులు చేయలేని పనులను కూడా చేసేస్తోంది. రెండేళ్ల క్రితం చోరీ అయి పోలీసులు కూడా కనిపెట్టలేక పోయిన లగ్జరీ కారు లంబోర్గినీని చాట్ జీపీటీ కనిపెట్టింది. 

New Update
lambo

Lamborghini Huracan 2023

అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అక్కడ కార్లు దొంగతనాలకు గురవుతున్నాయి. వీటిని వెతకడం యజమానులకు, పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించినా కనుక్కోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ ఆ పనిని సులభం చేసేసింది. రెండేళ్ల కిందట చోరీకి గురైన లగ్జరీ కారు లంబోర్గిని హురాకాన్ ఈవీఓను చాట్‌జీపీటీ కనిపెట్టింది. దీని యజమాని ఆండ్రూ గార్సియా రెండేళ్ల క్రితం పోగొట్టుకున్నారు.  దీంతో పాటూ మరి కొన్న లగ్జరీ కార్లు కూడా దొంగతనం అయ్యాయి. అయితే అన్నింటికంటే లంబోర్గినీ చాలా ఖరీదైనరది. ఇది మల్టీ మిలియన్ డాలర్లు ఉంటుందని చెబుతున్నారు. 

దొంగను పట్టిచ్చిన చాట్ జీపీటీ..

దొంగలు ముఠాలుగా ఏర్పడి లగ్జరీ కార్లను చోరీ చేస్తున్నారు. ఆ తర్వాత వాటి నంబర్ ప్లేట్లు, వీలయితే కలర్లు కూడా మార్చేసి తిరిగి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే గార్సియా లంబోర్గినీ కారుతో పాటూ దొంగతనం అయిన అన్ని కార్లనూ ఎలాగో అలా పోలీసులు పట్టుకోగలిగారు. కానీ లాంబోను మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే తాజాగా చోరీ అయిన కారును కొనుక్కుందామని వెళ్ళిన ఓ వ్యక్తికి అందులో  గార్సియా బిజినెస్ కార్డు ఓ వ్యక్తికి దొరికింది. దాని ఆధారంగా ఆయనను సంప్రదించారు. ఇన్స్టా గ్రామ్ లో కారు కొత్త ఫోటోలు పంపించి...ఈ కారును అమ్మేసారా అని అడిగాడు. దాన్ని చూసిన గార్సియా తానే స్వయంగా ఆరాలు తీశారు. చాట్ జీపీటీ సాయంతో ఇన్స్టా ఫోటోను విశ్లేషించి, గూగుల్ లోకేషన్ ను కనుక్కున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కారును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆ లాంబో గార్సియాదేనని ధృవీకరించారు. 

సూపర్ ఫాస్ట్ కార్..

అత్యంత కాస్ట్లీ, ఫేషనబుల్ కార్లలో లంబోర్గిని హురాకాన్ ఈవీఓ ఒకటి. కార్ల ప్రియులకు ఈ కార్ ఒక కల. ప్రత్యేకమైన వెడ్జ్ డిజైన్‌, రేజింగ్ బుల్ లోగోతో ప్రసిద్ధి పొందింది. ఈ కారు 5.2 లీటర్ల వీ10 ఇంజిన్‌తో 631 హెచ్‌పీ శక్తి, 600 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఫీచర్లలో ఆ లాంబో గంటకు 325 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. 100 కి.మీ వేగాన్ని కేవలం 2.9 సెకెన్లలో చేరుకోగలదని చెబుతున్నారు. 

Also Read: BIG Breaking: అమెరికాలో కాల్పుల కలకలం..స్కూల్ పిల్లలపై షూటింగ్..ముగ్గురు మృతి

Advertisment
తాజా కథనాలు