/rtv/media/media_files/2025/08/24/bapatla-2025-08-24-22-54-05.jpg)
lap tops Theft
ముంబై నుంచి చెన్నైకు వెళుతున్న ల్యాప్ ట్యాప్ కంటెయినర్ ను దొంగలు దోచుకెళ్లారు. దారి మధ్యలో బాపట్ల దగ్గర కంటెయినర్ ఆపి మరీ తీసుకెళ్ళిపోయారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు. ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను నాలుగు కంటైనర్లలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద కంటెయినర్ అలారం బ్రేక్ అయినట్టు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందింది. శనివారం తెల్లవారు ఝాము ఈ దొంగతనం జరిగింది. దీని తరువాత లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడినుంచి పరారయ్యారు.
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద కంటెయినర్ లారీ నుంచి సుమారు 255ల్యాప్‌టాప్‌లను దుండగులు అపహరించారు.
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 24, 2025
కంటెయినర్‌ను అక్కడే వదిలేసి లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని చీరాల డీఎస్పీ మొయిన్ తెలిపారు.
చోరీకి… pic.twitter.com/mHWgsh44mm
దొంగలను వెతికేందుకు ప్రత్యేక బృందాలు..
విషయం తెలుసుకున్న కంపెనీ ప్రతినిధులు ఆదివారం మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎత్తుకెళ్ళిపోయిన ల్యాప్ టాప్ల మొత్తం విలువ రూ.1.85 కోట్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Also Read: Dharmasthala: ధర్మస్థల చిన్నయ్య పెద్ద అబద్ధాల కోరు..భీమా భార్య