/rtv/media/media_files/2025/09/05/theft-at-work-2025-09-05-11-16-53.jpg)
Theft at work
తాము చదువుకోకపోవడం వల్లే చిన్నచిన్న పనులు చేసుకుని జీవించాల్సి వస్తుందని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తు్న్నారు చాలామంది తల్లిదండ్రులు. తమ ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ పిల్లలను భాగా చదివించాలనుకుంటున్నారు. అలాంటిదే ఓ తల్లి తన బిడ్డను ఇంజినీరింగ్ చదివిస్తోంది.అయితే బిడ్డ ఇంజినీరింగ్ పీజు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో తను పనిచేస్తున్న ఇంట్లోనే చోరీకి పాల్పడింది.
వివరాల ప్రకారం,,టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో గురువారం మీడియా సమావేశంలో ఏసీపీ సయ్యద్ ఫయాజ్ వివరాలను వెల్లడించారు.నిజాం కాలనీలో ఉండే సబీయా బేగం(36) టోలిచౌకి మెరాజ్ కాలనీలో నివసించే షఫీ అలీఖాన్ ఇంట్లో గడచిన 25 సంవత్సరాలుగా పనిమనిషిగా పనిచేస్తోంది. రెండున్నర దశాబ్ధాలుగా అదే ఇంటిలో పనిచేస్తుండటంతో ఇంటి యజమానులకు ఆమె మీద పూర్తి నమ్మకం ఏర్పడింది. యజమానులు ఎటు వెళ్లినా షబీయాబేగం కు ఇంటిని అప్పగించి వెళ్లేవారు.
ఇది కూడా చూడండి:AP Govt: ఏపీ సర్కార్ కొత్త చట్టం.. తప్పుడు పోస్టులు పెడితే జైలుకే!
అయితే ఇటీవల షబీయా బేగం కూతురుకు ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీటు వచ్చింది. అయితే ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో సబీయా బేగం తాను పనిచేస్తున్న ఇంట్లో గత దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లే ఈ నెల 20 న యజమాని కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు ఇంటికి వెళ్లిన సమయంలో దొంగతనానికి పాల్పడింది. ఆ రాత్రి షఫీ అలీఖాన్ ఇంటికి వచ్చిన తర్వాత తన ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి టోలిచౌకి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పని మనిషి వ్యవహారంపై అనుమానం వచ్చింది. ఆమె కదలికలపై నిఘా పెట్టారు.
Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!
ఈ క్రమంలో గురువారం ఉదయం టోలిచౌకిలోని ఓం జువ్వెల్లర్స్ దుకాణానికి వచ్చిన ఓ మహిళ అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అదనపు ఇన్‌స్పెక్టర్ బాల్‌రాజ్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి సబీయా బేగంను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా, తాను దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. ఫీజు కట్డానికి డబ్బులు లేకుంటే చోరీ చేశానని తెలిపింది.
ఇది కూడా చూడండి:AP Cabinet Meeting: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే కీలక చర్చ!
కాగా చోరీ చేసిన నగలను మెహిదిపట్నలోని ఓక జువెల్లర్స్ మణపురం ఫైనాన్స్‌లలో తాకట్టు పెట్టి నట్లు తెలిపింది. దీంతో ఆ నగలను స్వాధీనం చేసుకుని సదరు మహిళను రిమాండ్‌కు తరలించారు.ఈ మీడియా సమావేశంలో ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్‌స్పెక్టర్ రమేశ్ నాయక్, అదనపు ఇన్‌స్పెక్టర్ బాల్‌రాజ్‌తదితరులు పాల్లొన్నారు.
ఇది కూడా చూడండి:TG Dasara Holidays: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే