Panchayat Sarpanch: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. దొంగతనం చేయడంలో కిక్కే వేరట.. బయటపడ్డ సర్పంచ్ భాగోతం

చెన్నైలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ 5 తులాల గొలుసు చోరికి గురైంది. దర్యాప్తులో నరియంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతి దొంగిలించినట్లు గుర్తించారు. ఆపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె అధికార డీఎంకే నాయకురాలు కావడం విశేషం.

New Update
Panchayat president arrested for stealing chain from bus passenger in Chennai

Panchayat president arrested for stealing chain from bus passenger in Chennai

తమిళనాడులో ఊహించని ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బస్సులో ప్రయాణించి ఓ మహిళ తన తోటి ప్రయాణికురాలి బంగారం దొంగిలించింది. అనంతరం ఏమీ ఎరుగనట్టు మెల్లగా ఇంటికి జారుకుంది. వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టి.. చివరికి బంగారం దొంగిలించిన మహిళను గుర్తించారు. అయితే ఆమె ఎవరో తెలిసి అంతా షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Panchayat president stealing gold chain

నేర్కుండ్రం నివాసి అయిన 50 ఏళ్ల వరలక్ష్మి ఇటీవల కాంచీపురంలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌కు హాజరైంది. ఆ వేడుక పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి బస్సులో ప్రయాణించింది. తన గ్రామం రాగానే వరలక్ష్మి దిగిపోయింది. అనంతరం ఇంటికి వెళ్లి చూడగా.. తన 5 తులాల బంగారు గొలుసు కనిపించలేదని గుర్తించింది. దీంతో ఆమె కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

రంగంలోకి దిగిన కోయంబేడు పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఆ దొంగతనం చేసింది మరెవరో కాదని.. బస్సులో వరలక్ష్మి పక్కన కూర్చున్న మహిళ గొలుసు దొంగిలించిందని పోలీసులు కనుగొన్నారు. అనంతరం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె ఎవరో తెలిసి పోలీసులు ఖంగుతిన్నారు. ఆమె తిరుపత్తూరు జిల్లాలోని నార్యంపట్టు పంచాయతీ సర్పంచ్‌ భారతి (56) గా గుర్తించి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఆమెను డిఎంకె కార్యకర్త అని తెలిసి ఖంగుతిన్నారు. ప్రజాసేవలో ఉన్న ఒక మహిళ ఇలాంటి దొంగ బుద్ది చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. 

అనంతరం నిందితురాలు భారతిని అరెస్టు చేసి.. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈమెపై గతంలో కూడా తిరుపత్తూరు, వెల్లూరు, అంబూరు ప్రాంతాలలో పలు దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ సంఘటనను ఖండించారు. 

అనంతరం ఈ కేసు విచారణలో నిందితురాలు భారతి సంచలన విషయాలు వెల్లడించింది. చోరీలతో వచ్చే ఆ కిక్కే వేరని ఆ మహిళా సర్పంచ్ అంటుంది. 15 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఆమె అంగీకరించింది. డబ్బు, పలుకుబడి ఉన్నా.. దొంగతనం చేసినప్పుడు వచ్చే ఆ ఆనందమే వేరు.. అందుకే 15 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపింది. ఆమె మాటలకు పోలీసులకు ఒక్కసారిగా దిమ్మతిరిగిందనే చెప్పాలి.

Advertisment
తాజా కథనాలు