విషాద విహారయాత్ర.. నీట మునిగి 8 మంది మృతి
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే.
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే.
రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని, ఈ కథను చరణ్‌కు వినిపించి ఒప్పించారని కూడా తెలుస్తోంది. ఈ చిత్రం కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఉండబోతుందని సమాచారం.
సరూర్‌నగర్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. మరియాదాస్ అనే వ్యక్తి తన భార్య అమృతను చున్నీతో ఉరేసి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే అమృత హత్యకు కారణమని తెలుస్తుంది.
లిక్కర్ స్కామ్ ఆరోపణలు, వీడియో వైరల్ అవడంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఫైర్ అయ్యారు. తనకు వస్తున్న ప్రజాదారణ తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు.
గాజాలో మానవతా సాయం అందించడం కోసం స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ను ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఆమెను దేశం నుంచి వెనక్కి పంపించామని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారులుగా నటిస్తూ భక్తులును మోసం చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై కీలక అప్డేట్ వచ్చింది. జులై మొదటివారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆగస్టు 14లోపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ బిజినెస్ మెన్ రాజా రఘువంశీ హత్య కేసును మేఘాలయ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి రాజా భార్య సోనమ్ రఘువంశీ అని పోలీసులు తేల్చారు.