HBD Megastar Chiranjeevi: మెగాస్టార్ ని ఆకాశానికెత్తిన అల్లు అర్జున్.. బర్త్ డే ట్వీట్ వైరల్!

మెగాస్టార్ మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు.  ''వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్'' చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు అని తెలిపారు.

New Update
allu arjun - megastar

allu arjun - megastar

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 70వ  పుట్టినరోజు(HBD Megastar Chiranjeevi) ను జరుపుకుంటున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరు 70వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా మెగాస్టార్ ఫ్యాన్ మేడ్ వీడియోలు, బర్త్ డే పోస్టర్లతో నిండిపోయింది. మరోవైపు చిరు బర్త్ డే కానుకగా  'స్టాలిన్' రీరిలీజ్ తో థియేటర్లనీ సందడిగా మారాయి. వింటేజ్ మెగాస్టార్ ని మరోసారి తెరపై చూస్తూ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. 

Also Read :  కోటి రూపాయల పారితోషికం తీసుకున్న తొలి హీరో చిరునే.. ఏ సినిమాకో తెలుసా?

అల్లు అర్జున్ ట్వీట్

ఇదిలా ఉంటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల నుంచి సినీ తారల, ప్రముఖుల  వరకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తాజాగా మెగాస్టార్ మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు.  ''వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్'' చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు అని తెలిపారు. అయితే ఏపీ ఎన్నికల(AP Elections) సమయం నుంచి మెగా -అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పైకి అంతా కలిసిపోయినట్టు ఉన్నా.. లోపల ఇరు కుటుంబాల మనస్పర్థలు వచ్చాయని టాక్.  ఈ క్రమంలో అల్లు అర్జున్ మెగాస్టార్ కోసం బర్త్ డే ట్వీట్ చేయడం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. 

అసలేం జరిగింది.. 

అయితే ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీ నాయకుడు శిల్పా రవికుమార్ తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడం మెగా - అల్లు ఫ్యామిలీలో చిచ్చురేపింది. దీని తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావడైనా పరాయివాడే అంటూ సంచలన ట్వీట్ చేయడం మరింత చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఉద్దేశిస్తూనే నాగబాబు ఈ ట్వీట్ చేసినట్లు ప్రచారం జరిగింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఘటనలో అరెస్టయి జైలుకెళ్లి వచ్చిన తర్వాత కూడా మెగా హీరోలెవరూ పరామర్చించడానికి రాలేదు. దీంతో మెగా- అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు మొదలయ్యాయి. 

ఈ విషయాలు ఇలా ఉంటే.. 'పుష్ప2 ' తో మరో పాన్ ఇండియా హిట్టు కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న  ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇంటర్ నేషనల్ స్టాండర్స్ తో కూడిన గ్రాఫిక్స్ తో ఒక విజువల్ వండర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న ఇంట్రో వీడియో రిలీజ్ చేయగా .. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

Also Read :  విశ్వంభర గ్లింప్స్‌.. గూస్‌బంప్స్ అంతే!

Advertisment
తాజా కథనాలు