/rtv/media/media_files/2025/08/22/ci-madanapalli-2025-08-22-12-25-51.jpg)
కట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేయడానికి ఓ వివాహిత పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆమెను ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ సీఐ. ఈ ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడు. దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే 2018లో అతనికి కలికిరి ప్రాంతానికి చెందిన ఓ యవతితో పెళ్లి అయింది. అనంతరం కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె మదనపల్లి డీఎస్పీ ఆఫీసును ఆశ్రయించింది. ఈ క్రమంలో సదరు వివాహితతో సీఐ సురేష్ కుమార్ పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి మాయలో పడేసిన సురేష్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా
అయితే తన భార్యకు సీఐ సురేష్ తో పెళ్లైన విషయాన్ని 2021లో పవన్ కుమార్ కు తెలిసింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2023లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. దీంతో పవన్ కుమార్ 2023లో హైకోర్టును ఆశ్రయించి సదరు సీఐపై ప్రైవేట్ కేసు వేయించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా ఎలాంటి ఛార్జిషీటు వేయలేదు. దీంతో పోలీసులపై విసిగి వేసారిన బాధితుడు చివరికి పీఎంవోకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి డీజీపీ కార్యాలయానికి సమాచారం రావడం, ఉన్నతాధికారుల ఆదేశాలతో మదనపల్లె పోలీసులు 2025 జూన్‌లో సురేష్ పై కేసు నమోదు చేశారు. సదరు సీఐ సురేష్ తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారని, కానీ తల్లి కులం ఆధారంగా అతను ఉద్యోగంలో చేరినట్లుగా బాధితుడు సురేష్ పీఎంవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతని కుల ధ్రువీకరణ పైనా కడప జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు, కుల ధ్రువీకరణపై విచారణ నేపథ్యంలో సీఐ సెలవుపై తన ఊరికి వెళ్లారు.
అమీర్‌పేట్ లో హనీ ట్రాప్
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ లో హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. 81 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి రూ. 7 లక్షలు కాజేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా నిందితురాలు ఆ వృద్ధుడిని వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకుని ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. అతనికి దగ్గరై, ఇద్దరు శృంగారంలో పాల్గొన్నట్లు వీడియో రికార్డు చేసింది. ఆ వీడియో రికార్డును ఆధారంగా చేసుకుని మరోకరి చేత ఆ మహిళ వృద్ధుడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తన భర్తకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందని, డబ్బులు ఇవ్వకపోతే వీడియోను లీక్ చేస్తామని బెదిరించింది. బ్లాక్ మెయిల్ తో భయపడిన ఆ వృద్ధుడు ఆ మహిళకు పలు దఫాలుగా మొత్తం రూ. 7 లక్షలు ఇచ్చాడు. పదేపదే డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన వృద్ధుడు ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో చర్చించాడు. వారి సూచన మేరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అమీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్ మెయిల్ చేసిన మహిళ, ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.