Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పును సవరించింది సుప్రీం. . షెల్టర్ హోమ్‌కు పంపిన కుక్కలను విడుదల చేయాలని కోర్టు పేర్కొంది. అనారోగ్యంతో,  దూకుడుగా ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్ హోమ్‌లో ఉంచాలంది.

New Update
dogs

వీధి కుక్కల(Stray Dogs) బెడదపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని షెల్టర్లకు తరలించాలని ఈ నెల 11న తీర్పు ఇచ్చిన సుప్రీం.. ఇప్పుడు ఆ తీర్పును సవరించింది. షెల్టర్ హోమ్‌కు పంపిన కుక్కలను విడుదల చేయాలని కోర్టు పేర్కొంది. పలువురు ఆ తీర్పుపై నిరసన వ్యక్తం చేయడంతో తన నిర్ణయాన్ని సుప్రీం మార్చింది. రేబిస్‌(Rabies) ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్ తర్వాత ఆ కుక్కలను విడుదల చేస్తామని వెల్లడించింది.  మున్సిపల్ వార్డులలో వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల నియంత్రణ కోసం పనిచేసే ప్రభుత్వ అధికారులకు ఎవరైనా అడ్డుపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. జంతు ప్రేమికులు వీధి కుక్కలను దత్తత తీసుకోవాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)కి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Also Read :  వరుసపెట్టి కూలిపోతున్న యూఎస్ ఫైటర్ జెట్ లు..వర్జీనియా తీరంలో మరొకటి..

సుమోటోగా దాఖలైన కేసును

ఆగస్టు 11 సోమవారం దేశ రాజధానిలో కుక్క కాటుపై సుమోటోగా దాఖలైన కేసును విచారించిన సుప్రీంకోర్టు, ఢిల్లీ-ఎన్‌సిఆర్(Delhi-NCR) వీధుల నుండి అన్ని కుక్కలను ఎనిమిది వారాల్లోగా తీసుకురావాలని ఆదేశించింది.  వాటిని ఉంచడానికి షెల్టర్లను సృష్టించాలని,  వాటిని తిరిగి వదలకూడదని అధికారులను ఆదేశించింది.  వాటికివీధుల్లో ఆహారం పెట్టడం ఉండదని కూడా పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశం జంతు ప్రేమికులు,  సంక్షేమ సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.ఇది అమానవీయమైన చర్య అని, జంతువులకు జీవించే హక్కు ఉందని వారు వాదించారు. దీంతో ఆగస్టు 14న జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని కొత్త ధర్మాసనం ఈ విషయాన్ని విచారించి, ఆగస్టు 11 ఆదేశాలపై స్టే కోరుతూ దాఖలైన మధ్యంతర ప్రార్థనపై తన తీర్పును రిజర్వ్ చేసింది.

Also Read :  TVK సభలో తొక్కిసలాట.. 400 మందికి అస్వస్థత!

Advertisment
తాజా కథనాలు