Telangana Bandh: గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్

స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ నేడు ( ఆగస్టు 22)వ తేదీన తెలంగాణ బంద్‌కు ఉస్మానియా యూనివర్శిటీ JAC పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బంద్‌కు వర్తక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.  

New Update
telangana bandh

స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ నేడు ( ఆగస్టు 22)వ తేదీన తెలంగాణ బంద్‌కు ఉస్మానియా యూనివర్శిటీ JAC పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బంద్‌కు వర్తక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.    జనగామ స్వర్ణకారులు, కొండమల్లేపల్లి వ్యాపారులు మద్దతు ప్రకటించారు. నల్గొండలో రేపు మొబైల్ షాపులు బంద్ చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి జిల్లా వ్యాపారులు రేపు షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్ సహా హాలియా, దేవరకొండలో బంద్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.మరోవైపు తమపై విద్వేషపూరిత ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్వాడీ వ్యాపారులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. 

మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరకు అమ్ముతూ కస్టమర్లను, లోకల్ వ్యాపారస్థులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. కాగా మోండా మార్కెట్‌లో ఒక దళితుడిపై మార్వాడీ వ్యాపారులు దాడి చేశారని ఆరోపిస్తూ, దానికి నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణలో స్థానిక వ్యాపారాలకు, ఉపాధికి మార్వాడీల నుంచి ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బంద్ వలన ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ బస్సులు, ఆటోలు కూడా సేవలు నిలిపివేసే అవకాశం ఉన్నందున, ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టనున్నారు. 

Also Read :  India-Russia-China: ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్..కలిసి కొట్టడానికి రెడీ వుతున్న భారత్, రష్యా, చైనా

రాజకీయంగా ఉద్రిక్తంగా

మరోవైపు మార్వాడీ గో బ్యాక్ ప్రచారం రాజకీయంగా ఉద్రిక్తంగా మారింది. కొందరు దీనికి మద్దతిస్తుండగా మరి కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్, రాజాసింగ్‌లు మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అని ఆయన ఇప్పటికే ఆరోపించారు. మార్వాడీ గో బ్యాక్ అంటే తాము మటన్, డ్రైక్లీనింగ్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఓ వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. గో బ్యాక్ మార్వాడీ అనేది కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీలు కలిసి చేస్తున్న నాటకం అని బండి సంజయ్ అన్నారు. హిందువులను కులాల పేరుతో విడగొట్టడానికి ఈ కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.

మార్వాడీలు రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా వ్యాపారం చేస్తున్నారని, వారు ఎవరినీ దోచుకోవడం లేదని సంజయ్ పేర్కొన్నారు.  మార్వాడీలు హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి తోడ్పడుతున్నారని, అందుకే వారిని టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మార్వాడీలపై ఉద్యమం చేస్తే, తాము హిందూ కుల వృత్తులను కాపాడేందుకు ఉద్యమం చేపడతామని బండి సంజయ్ హెచ్చరించారు. మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు హైదరాబాద్‌లోని పాతబస్తీలో నివసిస్తున్న రోహింగ్యాలపై ఎందుకు ఉద్యమం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై తాము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.

Also Read :  Fighter Jet Crash: వరుసపెట్టి కూలిపోతున్న యూఎస్ ఫైటర్ జెట్ లు..వర్జీనియా తీరంలో మరొకటి..

Advertisment
తాజా కథనాలు