AP Mega DSC Results: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి!

మెగా డీఎస్సీ మెరిట్‌ జాబితా ఇవాళ రిలీజ్ కానుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాను మెగా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

New Update
mega dsc

మెగా డీఎస్సీ మెరిట్‌ జాబితా ఇవాళ రిలీజ్ కానుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాను మెగా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ జాబితా, ఎంపిక జాబితాలను తెలుసుకోవచ్చు.  

మెగా డీఎస్సీ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం...  సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించామనట్లుగా అధికారులు వెల్లడించారు. తర్వాత టెట్‌ మార్కులను సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చామని, అభ్యర్థుల స్కోర్‌ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థీ నష్టపోకూడదనే ఆలోచనతో టెట్‌ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చామని తెలిపారు. స్పోర్ట్స్‌ కోటా మెరిట్‌ జాబితా పూర్తయిన నేపథ్యంలో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కాగా, మెరిట్‌ లిస్టు ఆధారంగా డీఈవోలు ఆయా జిల్లాల్లో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా కటా్‌ఫను నిర్ణయించనున్నారు. ఎంపికైన అభ్యర్థులను ఒక ఉద్యోగానికి 1:1 ప్రాతిపదికన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలుస్తారు. వెరిఫికేషన్‌కు పిలవడమంటే ఉద్యోగానికి ఎంపికైనట్లేనని ఫిక్స్ అయిపోనట్లే. 

Also Read :  Crime : ఎంతకు తెగించావ్ రా...  అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని చంపేశాడు!

సర్టిఫికెట్లను ఆన్లైన్ లో అప్ లోడ్

మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్లు జారీ చేస్తారు. ఈ వెరిఫికేషన్ కు ముందు అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ఆన్లైన్ లో అప్ లోడ్ చేయడం తప్పనిసరి. అభ్యర్థులు తప్పుడు సమాచారం లేదా అనధికారిక వెబ్ సైట్లను నమ్మకుండా, అధికారిక వెబ్ సైట్ల ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని అధికారులు సూచిస్తున్నారు.కాగా ఈ మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులలో వివిధ సబ్జెక్టులు, కేటగిరీలు ఉన్నాయి.  స్కూల్ అసిస్టెంట్స్ (SAs), సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGTs),  పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PETs) వీటితో పాటు, మీడియం వారీగా (తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, కన్నడ, ఒడియా, తమిళం) కూడా పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా దళారులు చెప్తే వాటిని నమ్మకూడదని డీఎస్సీ కన్వీనర్ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. ఇలాంటి అబద్ధాలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇక ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన  హెచ్చరించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాలను మాత్రమే నమ్మాలని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు