USA Visa: అమెరికాలో విదేశీ ట్రక్ డ్రైవర్లకు నో వీసా...ఇండియన్స్ పై భారీ ఎఫెక్ట్

అమెరికన్ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రక్ డైవర్లకు వర్కర్ వీసాలను ఆపేసింది. విదేశీ డ్రైవర్ల కారణంగా చాలా మంది ప్రాణాలు పోతున్నాయని తెలిపింది. దీంతో చాలా మంది భారతీయులు ఇబ్బందుల్లో పడనున్నారు.

New Update
trucks

విదేశీయులకు ఇచ్చే వీసాలను మరింత కఠినతరం చేసింది అమెరికా ప్రభుత్వం. వర్కర్ వీసాలపై పరిమితిని పెట్టింది. వాణిజ్య ట్రక్కులను నడిపే డ్రైవర్లకు వీసాలు ఇవ్వమని ప్రకటించింది. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని...అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ తెలిపింది. ఈరోజు నుంచే ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుందని చెప్పింది. 

విదేశీయులకు నో ట్రక్ డైవర్ వీసాలు..

అమెరికా రోడ్లపై కంపెనీలకు చెందిన ట్రక్కులు చాలానే నడుస్తుంటాయి. ఇవి చాలా హెవీగా ఉంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా ప్రమాదం జరుగుతుంది. ట్రక్ యాక్సిడెంట్ అయితే కేవలం దానికే కాకుండా పక్కనున్న వాహనాలు కూడా నలిగిపోవడం ఖాయం. అయితే ఈ మధ్య కాలంలో అమెరికాలో భారీ ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్లు ఎక్కువ అవుతున్నారు. ఇందులో భారతీయులు కూడా చాలా మంది ఉంటున్నారు. అయితే వీరికి ఇంగ్లీషు సరిగ్గా రాకపోవడం, నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీని వలన అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో చెబుతున్నారు. అంతేకాదు అమెరికన్‌ ట్రక్కర్ల జీవనోపాధికి గండి పడుతోంది అంటున్నారు.

Also Read :  ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు..అమెరికా అండతో..

ఇంగ్లీషు రాకపోవడం వల్లనే..

రీసెంట్ గా ఫ్లోరిడాలోని ఒక హైవే పై రాంగ్ యూటర్న్ తీసుకుంటూ ముగ్గురు వ్యక్తులు చనిపోవడానికి కారణమయ్యాడు. భారతదేశానికి చెందిన హర్జిందర్ సింగ్. దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది ట్రంప్ ప్రభుత్వం . హర్జిందర్ సింగ్ మెక్సికో నుండి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడని.. ప్రమాదం తర్వాత ఇంగ్లీష్ పరీక్షలో కూడా ఫెయిల్ అయ్యాడని ఫెడరల్ అధికారులు తెలిపారు. ఈకారణంగానే ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాల నిలిపివేసే నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. 

దీంతో పాటూ ఇప్పుడు వారిపై కూడా కఠిన చర్యలను తీసుకునేందుకు ఉపక్రమించింది. డ్రైవర్లకు ఇంగ్లీష్ చదవడం, రాయడం తప్పనిసరిగా చేసింది. రోడ్లపై ఇంగ్లీషులో ఉండే సూచికలు చదవడం రాకపోవడం. మాట్లాడడం రాకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు డ్రైవర్లను పరీక్షించి...వారు అందులో ఫెయిల్ అయితే వీసాలను నిలిపి వేయనున్నారు. 

Also Read: Maharaj In Tariff: యుద్ధానికి ఆజ్యం పోస్తూ లాభాలు సాధిస్తోంది..భారత్ పై సుంకాలు తప్పువు..ట్రంప్ సలహాదారు

Advertisment
తాజా కథనాలు