/rtv/media/media_files/2025/08/26/killing-2025-08-26-12-51-11.jpg)
మనుషుల్లో రాక్షస పవృత్తి దారుణంగా పెరుగుతోంది. తల్లి,తండ్రి, భార్య, భర్త, కొడుకు అనే వావివరుసలు లేకుండా ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. గడచిన కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు కొకొల్లలుగా జరుగుతున్నాయి. తాజాగా ఏపీ మరో దారుణం(ap crime latest updates) చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను చంపి పారిపోయింది ఓ భార్య. ఈ ఘటన కర్నూలు జిల్లా మద్దికేర మండలం, ఎం.అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది. మూడ్రోజుల క్రితం భర్త వెంకటేష్‌ను చంపేసింది భార్య. అతన్ని కాల్చినట్లుగా కనిపిస్తుంది. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసమే భార్యే హతమార్చిందంటుందన్నారు గ్రామస్తులు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also Read : అన్నా వదినా అంటూ ఫ్రెండ్ లవర్తో సరసాలు.. స్వాతి కేసులో బిగ్ ట్విస్ట్!
స్వాతి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
అనంతపురం జిల్లాలో స్వాతి ఆత్మహత్య కేసు(Suicide Case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్తి ప్రాంతానికి చెందిన అరుణ్‌కుమార్, పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన స్వాతి (22), మరో యువతి ప్రతిభాభారతి అనంతపురం సాయినగర్ మూడో క్రాస్‌లో ఉన్న దీపు బ్లడ్ బ్యాంకులో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా వర్క్ చేస్తున్నారు. అయితే అరుణ్‌కుమార్, ప్రతిభాభారతి ఇద్దరూ రెండేళ్లుగా లవ్ లో ఉన్నారు. వారితో స్వాతి అన్నా వదినా అంటూ సన్నిహితంగా ఉండేది. అయితే ప్రతిభాభారతికి తెలియకుండా రహస్యంగా అరుణ్, స్వాతి ప్రేమ వ్యవహారం నడిపారు. ఈ విషయం ప్రతిభాభారతికి తెలిసిపోయింది.
Also Read : మీకు స్మార్డ్ రేషన్ కార్డు రాలేదా.. ఇలా చిటికెలో దరఖాస్తు చేసుకోండి!
దీంతో సోమవారం ఉదయం ఏడు గంటల టైమ్ లో స్వాతికి ఫోన్ చేసిన ప్రతిభాభారతి దారుణంగా తిట్టింది. అన్నా వదినా అంటూ నా ప్రియుడితోనే ప్రేమ వ్యవహారం నడుపుతావా? మీ ఇద్దరి విషయం నాకు తెలిసిపోయింది. ఈ రోజు ల్యాబ్ దగ్గరకు రండి. మీ కథ తేలుస్తానని స్వాతిని బెదిరించింది. దీంతో భయపడిపోయిన స్వాతి.. తాను ఉంటున్న హాస్టల్ ఎవరూలేని టైమ్ చూసి గదిలోని ఫ్యాన్‌కు చున్నీ బిగించుకుని అత్మహత్యకు పాల్పడింది. అయితే స్నేహితురాళ్లు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే స్వాతి చనిపోయినట్లుగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ వివరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
Also Read : Employment: నిద్రలేచింది మహిళా లోకం.. ఎంప్లాయ్‌మెంట్‌లో వాళ్లే 40శాతం
మరోవైపు మధ్యప్రదేశ్‌లో అత్యంత అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. భార్య కాళ్లు, చేతులు కట్టేసి వేడి కత్తితో ప్రైవేట్ పార్ట్‌లో కాల్చిడో శాడిస్ట్ భర్త. నొప్పితో అరుస్తోందని నోట్లో వేడి కత్తి పెట్టి చిత్రహింసలు పెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్‌గోన్ జిల్లాకు చెందిన యువకుడితో బాధిత యువతికి వివాహం జరిగింది. పెళ్లైన మొదటి రాత్రి నుంచే భార్యకు వేధింపులు మొదలయ్యాయి. నిత్యం తాగొచ్చి వంటగదిలోకి ఈడ్చుకెళ్లి చిత్రహింసలు పెట్టేవాడు భర్త. ఎలాగోలా భర్త నుంచి తప్పించుకుని బయటికొచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.