INS Udaygiri and Himgiri: భారత నౌకాదళంలోకి INS ఉదయగిరి, హిమగిరి..

భారత రక్షణశాఖ పురోగతిలో సరికొత్త ఘట్టం చోటుచేసుకుంది. విశాఖపట్నం నౌకాశ్రయానికి రెండు కొత్త భారీ యుద్ధ నౌకలు చేరుకున్నాయి. అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి యుద్ధ నౌకలను రక్షణ శాఖ ప్రవేశపెట్టింది.

New Update
INS Udaygiri and Himgiri

INS Udaygiri and Himgiri

భారత రక్షణశాఖ పురోగతిలో సరికొత్త ఘట్టం చోటుచేసుకుంది. విశాఖపట్నం నౌకాదళ డాక్‌యార్డ్‌లోకి రెండు కొత్త భారీ యుద్ధ నౌకలు చేరుకున్నాయి. అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి యుద్ధ నౌకలను రక్షణ శాఖ ప్రవేశపెట్టింది. వీటిని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత నౌకాదళాధిపతి అడ్మరల్ త్రిపాఠీ జాతికి అంకితం చేశారు. 

ఐఎన్‌ఎస్‌ ఉదయగిరిని ముంబయిలోని మజగాన్ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్ (MDL) నిర్మించగా.. ఐఎన్‌ఎస్‌ హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్‌-ఇంజినీర్స్‌ (GRSE) నిర్మించింది. ఈ యుద్ధనౌకల్లో ఆధునిక డీజిల్/గ్యాస్ కంబైన్డ్‌ ప్రొపల్షన్ ప్లాంట్లు, అడ్వాన్స్‌డ్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ అలాగే భారత సాంకేతికతో తయారు చేసిన అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ల సూట్లు సమకూర్చారు. ఈ నౌకలకు సముద్ర జలాల్లో్ నిర్ణయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తిచేయగల సామర్థ్యం ఉంది. 

Also Read: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?

హిందూ మహాసముద్ర ప్రాంతం మొత్తం సముద్ర ప్రయోజనాలు రక్షించుకునేందుకు, అలాగే దేశ సామార్థ్యాన్ని పెంచేందుకు ఈ రెండు భారీ యుద్ధనౌకలు కీలక పాత్ర పోషించనున్నాయి. అంతేకాదు ఈ రెండు నౌకలు కూడా 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశారు. INS ఉదయగిరిని భారత నేవి వార్‌షిప్ డిజైన్ బ్యూరో తయారుచేసిన 100వ షిప్‌గా గుర్తించారు. రెండు వేరువేరు షిప్‌యార్డుల్లో నిర్మించిన ఈ రెండు భారీ యుద్ధనౌకల్ని ఒకేసారి ప్రారంభించడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. మొత్తంగా చూసుకుంటే నౌక నిర్మాణంలో చైనాను భారత్‌ అధిగమించేసింది.  చైనా 19 యద్ధనౌకలు నిర్మిస్తుండగా.. భారత్ సంఖ్య 20కి చేరుకుంది. ఈ యుద్ధనౌకల తయారీలో 200  ఎంఎస్‌ఎంఈలు పాల్గొన్నాయి. ఈ నౌకల నిర్మాణం ద్వారా 4 వేల మందికి ప్రత్యేక్షంగా, అలాగే 10 వేలమందికి పరోక్షంగా ఉపాధి లభించినట్లు అధికారులు తెలిపారు. 

Also read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్

Advertisment
తాజా కథనాలు