Ajit Doval: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?

పాకిస్తాన్ రహస్యంగా అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని తెలుసుకున్న భారతదేశం, ఆ విషయాన్ని నిర్ధారించడానికి అజిత్ దోవల్‌ను రహస్యంగా పాకిస్తాన్‌కు పంపించింది. ఆ సమయంలో ఆయన భారతదేశ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో పనిచేస్తున్నారు.

New Update
Ajit Doval - On a Mission

భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(ajit-doval) గురించి తెలియని వారే ఉండరు. ఆయన్ని ఇండియన్ జేమ్స్‌బాండ్ అని పిలుస్తారు. స్పై వరల్డ్‌(Spy World) లో ఆయనొక లెజెండ్. ఆయన జీవితంలో చేసిన బెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ గురించి తాజాగా ఓ పుస్తకంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ రహస్యంగా అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని తెలుసుకున్న భారతదేశం, ఆ విషయాన్ని నిర్ధారించడానికి అజిత్ దోవల్‌ను రహస్యంగా పాకిస్తాన్‌కు పంపించింది. ఆ సమయంలో ఆయన భారతదేశ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో పనిచేస్తున్నారు.

Also Read :  కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Ajit Doval Spied On Pakistan

1980 దశకంలో అజిత్ దోవల్ పాకిస్తాన్‌(Pakistan) లో ఫుల్ సెక్యురీటీ ఉన్న కహుటాలోని న్యూక్లియర్ రీసెర్చ్ సైట్‌లో అండర్ కవర్ ఆపరేషన్‌ కోసం దిగారు. అక్కడి ఖాన్ రీసెర్చ్ లేబొరేటరీస్ (KRL) కార్యకలాపాలను రహస్యంగా పరిశీలించడమే ఆయన లక్ష్యం. ఎవరూ గుర్తించకుండా, ఆయన ఒక సాధారణ భిక్షగాడి వేషంలో ఇస్లామాబాద్ వీధుల్లో తిరిగేవారు. కహుటాలో పనిచేసే శాస్త్రవేత్తలు, సైనికులు, అధికారులు రోజూ ఏం చేస్తున్నారని, వారి కదలికలను ఆయన జాగ్రత్తగా గమనించేవారు. ఈ మిషన్‌లో ఆయనకు ఒక చిన్న బార్బర్ షాపులో ముఖ్యమైన ఆధారం లభించింది. ఆ షాపుకు కహుటాలోని శాస్త్రవేత్తలు తరచుగా వచ్చేవారు. దోవల్ ఇతర భిక్షగాళ్ల మాదిరిగానే ఆ షాపు చుట్టుపక్కలా తిరిగేవాడు. ఎవ్వరూ పట్టించుకోని ఆ షాపు ఫ్లోర్‌పై పడి ఉన్న వెంట్రుకలను ఆయన రహస్యంగా సేకరించారు. ఆ వెంట్రుకలను అజిత్ దోవల్ ఇండియాకు పంపారు.

Also Read :  Maruti Suzuki e-VITARA: ప్రధాని మోదీ ల్యాంచ్ చేసిన ఈ-కారు.. ప్రత్యేకతలేంటో తెలుసా?

భారతదేశంలో వాటిని పరిశీలించినప్పుడు, ఆ వెంట్రుకలలో యురేనియం, రేడియేషన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో పాక్ న్యూక్లియర్ రీసెర్చ్ నిజమేనని ఆందోళన మొదలైంది. ఈ సమాచారం ఆధారంగా భారతదేశం తన జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అజిత్ దోవల్ చేసిన ఈ పని వల్ల పాకిస్తాన్ అణు పరీక్షలను దాదాపు పదిహేను సంవత్సరాలు ఆలస్యం అయ్యాయి.

ఈ సాహసోపేతమైన మిషన్‌ గురించి 'అజిత్ డోవల్ - ఆన్ ఎ మిషన్' అనే పుస్తకంలో డి.దేవదత్ వివరించారు. ఆరు సంవత్సరాల పాటు దోవల్ పాకిస్తాన్‌లోనే స్పై చేశారు. ప్రతి క్షణం ప్రాణాపాయాన్ని ఎదుర్కొన్నారు. ఈ సంఘటన ఆయన ధైర్యం, పట్టుదల, అసాధారణ గూఢచర్య నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిందని పుస్తకంలో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు