AP Crime: భర్తను టార్చ్ లైట్‌తో కొట్టి చంపిన భార్య.. ఏపీలో దారుణం!

పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం కొటలపర్రు శివారు వీరప్ప చెరువు వద్ద ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన భర్త వెంకటనారాయణను రెండో భార్య అనంతలక్ష్మి టార్చ్‌లైట్‌తో కొట్టి చంపింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
West Godavari Crime News

West Godavari Crime News

నేటి కాలంలో భార్యాభర్తల గొడవలు ఎక్కువ అవుతున్నాయి. సాధారణంగా దంపతులు ఒకరికొకరు తోడుగా ఉండేవారు. కానీ కొన్నిసార్లు వారి మధ్య తలెత్తే విభేదాలు, సమస్యలు పెరిగి నేరాలకు దారితీస్తాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి భర్తను చంపిన భార్య. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధాలు, గృహహింస వంటివి దీనికి కారణం కావచ్చు. ఈ నేరాలు సమాజంలో.. కుటుంబ సంబంధాలలో విశ్వాసం, భద్రతకు సంబంధించిన ప్రశ్నలను రేకెత్తిస్తాయి. ఈ నేరాల వెనుక ఉన్న కారణాలను పరిశీలించడం ద్వారా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడవచ్చు. అయితే ఏపీలో ఓ భార్య భర్తను టార్చ్‌టైల్‌తో చంపిటం కలకలం రేపుతోంది.

ఏ పనికి వెళ్లలేదనే కోపంతోనే..

పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) లోని పెనుగొండ మండలం కొటలపర్రు శివారు వీరప్ప చెరువు వద్ద ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన భర్త వెంకటనారాయణను రెండో భార్య అనంతలక్ష్మి టార్చ్‌లైట్‌తో కొట్టి చంపింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటనారాయణకు మొదటి భార్య చనిపోవడంతో అతడు అనంతలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వెంకటనారాయణ వారం రోజుల క్రితం గల్ఫ్ దేశం(Gulf Country) నుంచి కొటలపర్రుకు తిరిగి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి అతడు ఏ పనికి వెళ్ళడం లేదని భార్య అనంతలక్ష్మికి కోపం పెరిగింది. ఈ విషయమై వారిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గొడవ పరాకాష్టకు చేరింది. కోపంతో ఊగిపోయిన అనంతలక్ష్మి టార్చ్‌లైట్‌తో వెంకటనారాయణ తల వెనుక భాగంలో తీవ్రంగా కొట్టింది.

ఇది కూడా చదవండి: అన్నా వదినా అంటూ ఫ్రెండ్ లవర్తో సరసాలు.. స్వాతి కేసులో బిగ్ ట్విస్ట్!

తీవ్ర గాయాలపాలైన వెంకటనారాయణ అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య గురించి పూర్తిగా తెలుసుకోవడానికి పోలీసులు అనంతలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు ఈ హత్య కేసు(Murder Case) ను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వెంకటనారాయణ ఏ పనికి వెళ్లలేదనే కోపంతోనే ఆమె ఈ హత్య చేసిందా లేక దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇది కూడా చదవండి: కట్నం కోసం వేధింపులు.. నోట్లో వేడివేడి కత్తి పెట్టి.. ఇంకా చెప్పలేని ఘోరాలు!

Advertisment
తాజా కథనాలు