/rtv/media/media_files/2025/08/26/bjp-likely-to-get-new-national-president-ahead-of-bihar-polls-announcement-2025-08-26-14-56-47.jpg)
BJP likely to get new national president ahead of Bihar polls announcement
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. దీనికి సంబంధించిన ఎన్నిక కూడా గత కొంతకాలంగా వివిధ కారణాలతో వాయిదా పడుతూనే ఉంది. దీంతో పార్టీకి కొత్త సారథి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైకమాండ్ అగ్రనేతల మధ్య దీనిపైనే సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?
ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ వేగం పెంచనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురి పేర్లను కూడా అగ్రనేతలు పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు మహిళా నేతకు అప్పగించనున్నట్లు ఇటీవల ప్రచారం నడిచింది. ఈ రేసులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్, అలాగే ఏపీ బీజేపీ ఎంపీ పురందేశ్వరితో పాటు పలువురు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
Also Read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్
మరి బీజేపీ మహిళా నేతకే అవకాశం ఇస్తుందా ? లేదా ? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ నూతన అధ్యక్షుడి కోసం కేవలం సామాజిక సమీకరణలు మాత్రమే కాకుండా పార్టీని బలోపేతం చేసే నాయకుడి కోసమే చూస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి బీజేపీ సంస్థాగత ఎన్నికలను మూడేళ్లకొకసారి నిర్వహిస్తుంటారు. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 నుంటి ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆయన రెండో టర్మ్ 2024 జూన్‌తో ముగిసింది .
Also Read: కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
బీజేపీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే 50 శాతం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికావాలి. అంతకన్నా ముందు బూత్, మండల, జిల్లా స్థాయిలకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సింది. కానీ ఇటీవల హర్యానా, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు, వీటికి తోడు పార్లమెంటు ఎన్నికలు కూడా రావడంతో ఆలస్యం జరిగింది. పార్టీ శ్రేణులు కూడా కొత్త జాతీయ అధ్యక్షుడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగాలని కోరుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే .
Also Read: జూబ్లీహిల్స్ బై పోల్ పై ఈసీ మరో కీలక నిర్ణయం..నోడల్ అధికారుల నియామకం