/rtv/media/media_files/2025/08/26/pakistan-bowler-haris-rauf-warns-india-ahead-of-asia-cup-2025-08-26-16-22-57.jpg)
Pakistan bowler Haris Rauf warns india ahead of asia cup
ఆసియా కప్ 2025(Asia cup 2025) యూఏఈ(UAE) వేదికగా సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్ దశలో ఇరుజట్లు విజయాలు సాధిస్తే మరోసారి క్వాలిఫైయర్‌లో తలపడే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌లపై ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్థాన్ బౌలర్ హరిస్ రౌఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రెండు మ్యాచ్‌లు మావే, ఇన్షా అల్లాహ్'' అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Haris Rauf Warns India Ahead Of Asia Cup
Haris Rauf on Pakistan vs India. 🇵🇰🔥 pic.twitter.com/1nywqFxGou
— Sheri. (@CallMeSheri1_) August 24, 2025
పాకిస్థాన్(Pakistan) సెప్టెంబర్ 12న తమ మొదటి మ్యాచ్‌ను దుబాయ్(Dubai) వేదికగా ఒమాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్‌తో ఆడనుంది. క్వాలిఫైయర్ దశలో కూడా భారత్-పాక్ తలపడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రెండు మ్యాచ్‌లు మేమే గెలుస్తామని హరిస్ రౌఫ్ చెప్పడం చర్చనీయమవుతోంది. ఈ ఆసియా కప్ 2025లో రెండు గ్రూపులు ఉన్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, UAE, ఒమన్ ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, హాంకాంగ్, చైనా జట్లు ఉన్నాయి.
Also Read: చరిత్ర సృష్టించిన షకీబ్.. తొలి క్రికెటర్‌గా రికార్డు!
ఆసియా కప్ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ ఈ టోర్నీకి హైలెట్ కానుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వల్ల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారనుంది. ఇప్పటికే పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ కూడా ఆటగాళ్లు, అభిమానులకు హెచ్చరిక జారీ చేశారు. మీరు గీతను దాటవద్దని, ఆట స్పూర్తిని కాపాడుకోవాలని సూచించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు స్టేడియం లోపల, వెలుపల సంయమనాన్ని పాటించాలనే సందేశాన్ని సూచిస్తున్నాయి.
Also Read: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?
మరోవైపు భారత్-పాకిస్థాన్ మధ్య ఎప్పుడూ కూడా, ఏ మ్యాచ్ జరిగిన దాన్ని కేవలం ఆటగానే క్రికెట్ ఫ్యాన్స్ చూడరు. ఆ మ్యాచ్‌ను కూడా తమ భావోద్వేగాలతో ముడిపెట్టుకుంటారు. ఈ మ్యాచ్‌లలో ఆటగాళ్లు, అభిమానుల ప్రవర్తనపై అందరి ఫోకస్ ఉంటుంది. వసీ అక్రమ్ ఒకప్పుడు పాక్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అతడి హెచ్చరికలు ఆటగాళ్లు మైదానంలో సంయమనం పాటించాలని, క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో వేదికలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచిస్తోంది. సెప్టెంబర్ 14న జరగబోయే మ్యాచ్‌లో మరి ఏ జట్టు గెలుస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also Read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్