/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
Wife who killed a mugger for her lover..
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను కాటికి పంపుతున్న భార్యల జాబితాలో మరో మహిళ చేరింది. ఓ భార్య. తన వివాహేతర సంబంధానికి(Illegal Affair) అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి హత్య(wife-killed-her-husband) చేసింది. ఆ తర్వాత సహజ మరణంగా చిత్రీకరించి.. అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. అయితే భర్త చనిపోయిన మూడవ రోజు కర్మకాండల కార్యక్రమం చేయాల్సి ఉంది. ఈ సమయంలో కన్నకొడుకుతో గొడవకు దిగడంతో భర్త హత్య విషయం వెలుగు చూసింది. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలంలో కలకలం రేపింది.
ఇది కూడా చదవండి:అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్
Wife Killed Her Husband
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.వెల్మల్ గ్రామానికి తిరునగరిహరిచరణ్, నాగలక్ష్మీ భార్యాభర్తలు. గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి 28 ఏళ్ల కుమారుడు, 25 ఏళ్ల కూతురు ఉన్నారు. వారి కొడుకు దుబాయ్‌లో ఉంటున్నాడు. కాగా నాగలక్ష్మి కి మహేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వారిద్దరూ తరచుగా కలుసుకుంటున్నారు. ఈ విషయంలో హరిచరణ్ కు అనుమానం రావడంతో ఆమెను మందలించాడు. కొడుకు కృష్ణకు అసలు విషయం చెపుతానని భర్త హరిచరణ్ భార్య నాగలక్ష్మిని బెదిరించాడు.
ఇది కూడా చదవండి:లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!
అయితే భర్త తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈనెల 22న అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో ప్రియుడు మహేష్ ను ఇంటికి పిలిపించుకున్న నాగలక్ష్మి.. గాడ నిద్రలో ఉన్న భర్త హరిచరణ్ ను బంధించి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఇద్దరు కలిసి హత్య చేశారు. అనంతరం మృత దేహాన్ని బాత్రూంలో పడేసి మూర్చ వ్యాధితో మృతి చెందాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. ఆగమేఘాల మీద అంత్యక్రియలు కూడా జరిపించింది. అయితే తండ్రి మరణ వార్త విని హుటాహుటిన దుబాయి నుండి ఇంటికి చేరుకున్న కొడుకు తన తండ్రి అంత్యక్రియలకు నోచుకోలేదని తీవ్రంగా దుంఖించాడు.
అయితే తాను రాకముందే తండ్రి అంత్యక్రియలు చేయడంపై అనుమానం వ్యక్తం చేశాడు. భర్త చనిపోయిన మూడవ రోజు కర్మకాండలు చేయాల్సి ఉండగా. బొట్టు కుంకుమ గాజులు తీసేయాలంటూ బంధువులు కోరారు. దానికి నాగలక్ష్మి ఒప్పుకోలేదు. కొడుకు చెప్పిన వినలేదు. దీంతో కొడుకు కృష్ణకు అనుమానం వచ్చింది. తన తండ్రి మరణంపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నాగలక్ష్మిని విచారించడంతో భర్త హరిచరణ్ ను ప్రియుడు మహేష్ తో కలిసి తానే హత్య చేశానని ఒప్పుకుంది. పోలీసులు ప్రియుడు మహేష్ ను, నాగలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి:Crime News : ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ