CDS Anil Chauhan: భవిష్యత్తులో వాటి వల్లే యుద్ధాలు జరుగుతాయి.. డిఫెన్స్‌ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

భారత చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్ అనిల్ చౌహన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన యుద్ధాలకు ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలకు చాలావరకు తేడాలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు నాలుగు కారణాలు ఉంటాయని చెప్పారు.

New Update
CDS Anil Chauhan strong war message, says ‘Operation Sindoor still on’

CDS Anil Chauhan strong war message, says ‘Operation Sindoor still on’

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine), ఇజ్రాయెల్-హమాస్‌(Israel-Hamas) ల మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత్‌-పాకిస్థాన్, థాయ్‌లాండ్‌-కంబోడియా ఇంకా ఇతర దేశాల మధ్య కూడా యుద్ధం జరిగింది. ఇప్పటికే అనేక దేశాలు తమ రక్షణ వ్యవస్థను మెరగుపర్చుకునేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. చాలాదేశాలు న్యూక్లియర్ ఆయుధాలను కూడా తమ అమ్ములపొదిలో దాచిపెట్టుకున్నాయి. ప్రస్తుతం ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలున్నాయనే ఊహగాణాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్ అనిల్ చౌహన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?

Anil Chauhan Comments On Future Wars

భారత్‌ ఎప్పడిటికీ శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉంటుందని దాన్ని అలుసుగా తీసుకొని ఏ దేశమైన దెబ్బకొట్టాలని చూస్తే ఊరుకునేది లేదంటూ తేల్చిచెప్పారు. గతంలో జరిగిన యుద్ధాలకు ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలకు చాలావరకు తేడాలున్నాయని తెలిపారు. గతంలో వ్యతిరేక భావజాలం, భుభాగాలను ఆక్రమించుకునేందుకు యుద్ధాలు జరిగేవని.. ప్రస్తుతం మాత్రం కొత్త వ్యూహాలతో ఆయా దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు నాలుగు కారణాలు ఉంటాయని చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

Also Read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్

మొదటిది ఆయా దేశాలు వాళ్ల రాజకీయ లక్ష్యాలు సాధించేందుకు బల ప్రయోగానికి దిగడం వల్ల యుద్ధాలు జరుగుతాయి. రెండవది ఇతర దేశాలతో పోటీ, సంక్షోభం, ఘర్షణ లాంటి అంశాల్లో శాంతి, యుద్ధానికి మధ్య తేడాను అర్థం చేసుకోలేకపోవడం. మూడవది ప్రజల అవసరాలకే అధికంగా ప్రాధాన్యం ఇవ్వడం. ఇక నాలుగోది విజయాన్ని నిర్ణయించే కొలమానాల్లో మార్పులు రావడం. ఈ నాలుగు కారణాల వల్ల భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని అనిల్ చౌహన్ పేర్కొన్నారు. 1971లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగినప్పడు భారత్.. 95 వేల మంది పాకిస్థానీయులను బంధించిందని తెలిపారు.  అంతేకాదు ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో ఆయుధాల రేంజ్, దాడుల ప్రభావాలను కొలమానంగా తీసుకున్నట్లు అనిల్ చౌహన్ చెప్పారు . 

Also Read: కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

అలాగే ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor) నుంచి భారత్‌ పాఠాలు కూడా నేర్చుకుందని.. వాటితో భవిష్యత్తులో జరగబోయే ఘర్షణలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుందని పేర్కొన్నారు. దీనికోసం త్రివిధ దళాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. రక్షణ వ్యవస్థలు, ఆయుధ శక్తిని మరింత మెరుగుపర్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల పక్కన నిలబడాలంటే శశాస్త్ర, సురక్షిత, ఆత్మనిర్భర్‌గా మారడం ఎంత ముఖ్యమే.. ప్రజలను సైద్ధాంతికపరంగా వారి ఆలోచనలు, కార్యాచరణల్లో మార్పు తీసుకురావడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు . 

Also Read: జూబ్లీహిల్స్ బై పోల్ పై ఈసీ మరో కీలక నిర్ణయం..నోడల్ అధికారుల నియామకం

Advertisment
తాజా కథనాలు